విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఏ ఒక్కరూ కూడా వైద్యం అందక ఇబ్బందులు పడకూడదు అనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని,అందుకే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్న సరే ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరించి వెయ్యి రూపాయలు దాటిన వైద్య సేవలను చేర్చడంతో పాటు,ప్రక్క రాష్టాల్లో కూడా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 4,21 మరియు 22 డివిజన్ లకి చెందిన శేషమ్మ,భారతి,వెంకటేశ్వరరావు,కుమారి లకి ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు దాదాపు రూ.6,00,000/- చెక్కులను అవినాష్ అందజేసారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం లో ముఖ్యమంత్రి సహాయనిధి ని టీడీపీ నాయకులు నిర్వీర్యం చేశారని, స్వర్గీయ వైయస్సార్ పెట్టిన ఆరోగ్య శ్రీ ని కార్పొరేట్ ఆసుపత్రిలతో కలిసి కుమ్మక్కై అవినీతి కి పాల్పడ్డారని విమర్శించారు. నాడు ఎవరికైనా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందలి అంటే జన్మభూమి కమిటీలకు లంచాలకు ఇచ్చే పరిస్థితి అని,అదే వారు ప్రక్క పార్టీ అయితే అసలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆరోపించారు. కానీ నేడు ఎవరికి లంచాలు ఇచ్చే అవసరం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా అవసరమైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా లబ్ది చేకూరుతుంది అని అవినాష్ అన్నారు.కేవలం ఒక్క రోజు లోనే ఆరోగ్య శ్రీ కార్డ్ మంజూరు చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని సగర్వంగా చెప్పారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం లో అసలు ఎవరికి ముఖ్యమంత్రి సహాయనిధి అందలేదు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అని కానీ ఈ మూడేళ్ళ కాలంలోనే తూర్పు నియోజకవర్గంలో దాదాపు 6 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందించడం జరిగిందని వాస్తవాలు గ్రహిస్తే మంచిదని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పుప్పాల కుమారి,తాటిపర్తి కొండారెడ్డి,ఇంచార్జ్ గల్లా రవి,వైస్సార్సీపీ నాయకులు సొంగా రాజ్ కమల్,పులి రమణారెడ్డి,పుప్పాల రాజా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News