విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అదమా ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో బిజినెస్ పార్ట్నర్ మీట్ విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమం మినుము పంటపై డీలర్స్కు అవగాహన సదస్సు విజయవాడ ఫుడ్ ప్లాజా హోటల్లో శుక్రవారం జరిగింది. ఈ సదస్సులో అదమా ఇండియా సంస్థకు సంబంధించిన నేషనల్ హెడ్ మార్కెటింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎస్.బి.వి.ఆర్.ప్రసాద్ ‘‘మాట్లాడుతూ ఇజ్రాయిల్ టెక్నాలజీతో ప్రపంచంలోనే అత్య ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు మంచి ఉత్పాదనలు అందిం చడంతోపాటు సరి సమానమైన ధరలలో ఉత్పాదనలు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పంటలు అధిక దిగు బడులు కోసం టెక్నాలజీ తెలుసుకోవడం చాలా ఉందని తెలిపారు. ఇందులో భాగంగా అదమా సంస్థ జనరల్ మేనేజర్ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ పంటలపై పిచికారి చేయడానికి డ్రోన్లు ద్వారా స్ప్రేయింగ్ చేయడాన్ని డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇదే విధంగా కమర్షియల్ బిజినెస్ యూనిట్ హెడ్ జి.పాపి నాయుడు మాట్లాడుతూ అదమా ఇండియా సమస్త వారు అత్యుత్తమ టెక్నాలజీతో పాటు అధిక దిగుబడులు పొందడానికి సరైన ఉత్పాదనలు రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. మినుము పంటపై వచ్చేటువంటి వివిధ రకాల తెగులును నియం త్రించడం కోసం, అధిక దిగుబడి కోసం అల్మగర్ అనే కొత్త ఉత్పాదనను డీలర్ల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సదస్సులో సంస్థ ఏ జి ఎం ఆంజనేయులు, మేక శ్రీనివాస్, 250 మంది డీలర్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News