-ముఖ్యమంత్రికి మాదిగ అభ్యుదయ సాధన వేదిక ప్రతినిధుల విజ్ఞప్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాదిగ జాతి అభ్యున్నతికి, మాదిగ జనాభా ప్రతిపాదికన అన్ని పదవుల్లో సమాన భాగం కల్పించడం, మాదిగల పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల శాంతియుతంగా పోరాటం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాదిగలను ఒకే గొడుగు క్రిందకి తీసుకొచ్చి మాదిగల్లో చైతన్యం తీసురావడం, మాదిగలను ఒక బలమైన సామాజిక శక్తిగా తయారు చేయడం కోసం, మాదిగ జాతిలో ఉన్న పెద్దలు మేధావుల సూచనలతో ఒక నూతన అధ్యయానికి నాందిపలుకుతూ, మాదిగ అభ్యుదయ సాధన వేదిక (యమ్.ఎ.యస్.బి)ని స్థాపించడం జరిగింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంస్థగా మరియు శక్తిగా పని చేస్తుంది అని మాదిగ అభ్యుదయ సాధన వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ చావలి సునీల్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చావలి సునీల్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా మాదిగలను పైకి తీసుకొని రావడంలో ఏపి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూనే యమ్.ఎ.యస్.వి పలు డిమాండ్లను నెరవేర్చాలని ముఖ్యమంత్రిని కోరారు. రాబోయే ఎన్నికల్లో 29 యస్.సి అసెంబ్లీ స్థానాలకు 14 సీట్లు మాదిగలకు కేటాయించాలి. నాలుగు యస్.సి పారమెంటు స్థానాలకు 2 సీట్లు మరియు 1 రాజ్యసభ సీటును మాదిగలకు కేటాయించాలి. ప్రస్తుత ప్రభుత్వంలో అన్ని పబ్లిక్ సరీస్ కమిషన్లలో ఇప్పటి వరకు చైర్మన్లగా మాదిగలకు కేటాయించలేదు. కావున కమిషన్ల చైర్మన్లుగా మాదిగలకు సముచిత స్థానం కల్పించాలి. ఏపి రాష్ట్ర యస్.సి కమిషన్ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఒక మాదిగ కూడా చైర్మన్ గా నియమింపబడలేదు. ఈసారి యస్సీ కమిషన్ చైర్మన్ మాదిగలను నియమించాలి. ఐ.ఎ.యస్, ఐ.పి.యస్, గేజిటడ్, నాన్-గేజిటడ్, అన్ని డిపార్ట్మెంటులలో మాదిగ ఉద్యోగులకు సముచిత స్థానం కల్పించాలి. రాష్ట్ర శాసనసభ స్పీకర్, డిప్యూటి స్పీకర్, రాష్ట్రశాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, పదవులలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలి. మాదిగల కోసం ప్రత్యేకంగా జగజ్జీవన్ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. హైకోర్టు మరియు దిగువ కోర్టులో పి.పి., ఎ.జి.పి పోస్టులలో అలాగే స్టాండింగ్ కౌస్సిల్లో మాదిగలకు సముచిత స్థానం కల్పించాలి. గత ప్రభుత్వంలో మాదిగల పై పెట్టిన (యమ్.ఆర్.పి.యస్) కేసులు అన్నిటిని తక్షణమే కొట్టివేయాలి. గత ఎన్నికలలో తెలుగు దేశం పార్టీని గద్దెదించి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన మాదిగలకు, మాదిగ ఉపకులాలకు సముచిత న్యాయం చేయాలని మాదిగ అభ్యుదయ సాధన వేదిక తరఫున చావలి సునీల్ కోరారు. విలేకరుల సమావేశంలో నాయకులు చెట్టే రాజు, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, బూదాల సలోమి, పిడతల అభిషేక్, మడికి కిషోర్‌బాబు, బూదాల శ్రీను, నలుకుర్తి రమేష్, బూదాల సౌమ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News