Breaking News

నడిపూడి పార్వతి కృష్ణ దంపతుల ఇంటి శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాధవీలత

-ఇంటి నిర్మాణాలకు దశల వారీగా చెల్లింపులు చేస్తున్నాం. కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మీ తరువాతి తరాలకు స్థిరాస్తి అందించే చక్కటి అవకాశం ఉందని, కొద్దిగా ధైర్యం చేసి ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత విజ్ఞప్తి చేశారు. శనివారం తాళ్లపూడి మండలం అన్నదేవర పేటలో వైయస్ఆర్ హౌసింగ్ లే అవుట్ ను సందర్శించి, కలెక్టర్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం లబ్దిదారుల స్వంత ఇంటి కల సాకారం చేసే విధానం లో మద్దత్తుగా నిలుస్తూ, అధికారుల ద్వారా తోడ్పాటు నివ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. ” ప్రతి శనివారం హౌసింగ్” కార్యక్రమాన్ని నిర్వహించి ఇళ్ళు నిర్మాణం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అందులో స్వంత ఇల్లు లేని వారికి ప్రభుత్వం స్వంత ఇంటి పేరుతో స్థలం కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ లే అవుట్ లు గ్రామానికి దూరం గా ఉన్నాయని , ఆర్ధిక భారం , మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిపై కలెక్టర్ కి లబ్దిదారులు విజ్ఞప్తి చేశారు. లబ్దిదారుల ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ ను ఓపికగా సమాధానం చెపుతూ, ఇంటి నిర్మాణం ఆర్థిక భారంతో కూడుకున్న, తరువాత తరాలకు ఒక సొంత ఇంటి ని అందించగలుగుతారని మాధవీలత పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం కోసం దశల వారీగా లక్ష ఎనభై ఐదు వేల రూపాయిలు, డ్వాక్రా) బ్యాంకు రుణం రూ.35-50 వేల వరకు ఎస్ హెచ్ జి మహిళా సభ్యులకు అందించే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తున్నామన్నారు. లే అవుట్ లలో ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి లే అవుట్ లలో ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి పూర్తి చేస్తే క్రమంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన కార్యాచరణ తో సిద్దంగా ఉన్నామని కలెక్టర్ మాధవీలత భరోసా ఇచ్చారు. ఇంటి నిర్మాణాల కోసం ఇసుక లే అవుట్ వద్ద సిద్దం చెయ్యడమే కాకుండా నీటి వసతి సమకూర్చి ఇళ్లు కట్టుకోవాడానికి అనువైన పరిస్థితి కల్పించడం జరుగుతున్నట్లు వివరించారు. ఇంటి నిర్మాణం కొంత ఆర్థిక ఇబ్బందితో ముడి పడి ఉన్నా, మహిళలుగా మనం కొంత ధైర్యం చేస్తే పరిస్థితి అనుకూలిస్తాయి అన్న భరోసా ఇవ్వడం జరిగింది. లబ్దిదారులు మిగిలిన చోట్ల ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను సందర్శించి, అక్కడ విద్యుత్, నీటి వసతి వంటి సౌకర్యాలు అందుబాటులో తీసుకుని వొచ్చిన తీరు ను పరిశీలించాలని తెలియచేశారు. పరిస్థితులకు అనుగుణంగా స్టేజ్ వారి నిర్మాణం పనులు చేసే క్రమంలో వాయిదా సొమ్ము మీ బ్యాంకు ఖాతాలకు ఎప్పటికప్పుడు వేస్తామని స్పష్టం చేశారు. మళ్ళీ 15 రోజుల తరువాత ఇదే లే అవుట్ కి వస్తానని, క్షేత్ర స్థాయి సమన్వయ శాఖల మండల అధికారులు, సిబ్బంది తరచు లబ్ధిదారులతో మాట్లాడి సొంత ఇంటి కల సాకారం దిశగా అడుగులు వేయాలన్నారు. లబ్దిదారులతో వాలేంటర్లను, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఒంటరి మహిళలు, కు గ్రూప్ ఏర్పాటుచేసి, ప్రభుత్వమే ఇల్లు కట్టించి భాద్యత తీసుకుంటుందని కలెక్టర్ తెలియచేశారు. . ఈ నేపథ్యం లోనే అన్నదేవరపేటకు చెందిన మహిళ నడిపూడి పార్వతి ఇంటి నిర్మాణానికి కలెక్టర్ భూమి పూజ చేశారు.

అనంతరం విలేఖరులతో కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా లో 57410 ఇళ్ళు మంజూరు కాగా ఇప్పటి వరకు 12 వేల 976 ఇళ్ళు పూర్తి అయ్యాయని, మిగతా ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మిగిలిన 6 వేల 36 ఇళ్ళు డిసెం బర్ 31 వ తేదీ నాటికి మొదలు పెట్టే విధంగా హౌసింగ్ అధికా రులకు ఆదేశాలు ఇచ్చామని ఆమె తెలిపారు. జిల్లా లో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 35 వేల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లా లో 24 వేల 491 డ్వాక్రా మహిళలకు బ్యాంక్ లోన్లు మంజూరు చేశామని అన్నారు. జిల్లా లో ఇప్పటి వరకు లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునేందుకు ఇప్పటి వరకు 328 కోట్లు మంజూరు చేసా మని తెలిపారు. అన్నదేవర పేట గ్రామం లో 826 మంది లబ్ధిదారుల్లో 250 మంది ఇళ్ళు కట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారన్నారు. మిగతా లబ్ధిదారులు కూడా ప్రభుత్వం ఇస్తున్న మౌలిక సదుపాయాలు కల్పిచడం తద్వారా మిగిలిన లబ్ధిదారులు కూడా ముందుకు వచ్చి ఇళ్ళు నిర్మించు కోవాలని కోరడం జరిగిందన్నారు .

ఈ కార్యక్రమం లో జిల్లా పరి షత్ వైస్ ఛైర్ పర్సన్, పోసిన శ్రీలేఖ, కొవ్వూరు ఆర్డీఓ, ఎస్. మల్లిబాబు, హౌసింగ్ డి. హెచ్. ఓ, తారాచంద్, హౌసింగ్ డి. ఈ. యం. శ్రీనివాస్, మండల తాహిసీల్దార్, టి. రాధిక, యం. పి. డి. ఓ, ఎమ్. రాజశేఖర్, యం. పిటిసి లు, ఎన్. కుసుమ కుమారి, యు. రాజ్య లక్ష్మి, సర్పంచ్, ఎలిపే సుధారాణి, శ్రీకృష్ణ దేవరాయులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *