Breaking News

రవాణాశాఖ ఉద్యోగుల భవనంనకు చైర్మన్ గా యం రాజుబాబు నియామకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రవాణాశాఖ ఉద్యోగులు ఏర్పరచుకున్న సంక్షేమ భవన్ నకు నూతన చైర్మన్ గా యం రాజుబాబును నియమిస్తున్నట్లు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ రఘుబాబు తెలియజేశారు. స్థానిక బందర్ రోడ్డు లోని డిటిసి కార్యాలయం సమీపంలో రవాణాశాఖ ఉద్యోగుల సంక్షేమ భవన్ లో ఆదివారంనాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. కొంతకాలంగా పెండింగ్ ఉన్నటువంటి విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లే విధంగా త్వరలోనే కార్యచరణ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ఐ రఘుబాబు అన్నారు. ఉద్యోగుల సంఘ భవనంనకు సంబందించి నూతన చైర్మన్ గా సంఘం జోన్2 అధ్యక్షుడు యం రాజుబాబుని నియమించాలని కమిటీ సభ్యులు నిర్ణయించడమైనదని రఘుబాబు తెలిపారు. వివిధ పనుల నిమిత్తం విజయవాడకు వచ్చిన ఉద్యోగులలు ఉండటానికి వీలుగా ఈభవనాన్ని నిర్మించడం జరిగిందని, రాష్ట్ర సంఘ సమావేశాలు వివిధ కార్యక్రమాలు కూడా ఇక్కడ నుండే నిర్వహించేవిధంగా సమావేశ మందిరంను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని రఘుబాబు తెలిపారు. నూతన ఛైర్మన్ గా ఎన్నికైన యం రాజుబాబు మాట్లాడుతూ దూరపు ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులను కూడా దృష్టిలో పెట్టుకొనే 2015లో ఈభవనం నిర్మాణం చేపట్టామని, సంఘ కార్యకలాపాలతో పాటు, రాష్ట్ర సచివాలయం హైకోర్టు పనుల నిమిత్తం వచ్చిన ఉద్యోగులకు వసతి అందుబాటులో ఉండేవిధంగా నిర్మిచుకోవడం జరిగిందన్నారు. విజయవాడ నగరానికి విచ్చేసిన రవాణాశాఖ ఉద్యోగులు వసతి సౌకర్యం నేరుగా పొందే విధంగా తగు ఏర్పాట్లు చేస్తామని, దీని నిమిత్తం ఒక ఫోన్ నెంబర్ను కూడా ఇవ్వడం జరుగుతుందని రాజుబాబు తెలియజేసారు. సమావేశం అనంతరం రఘుబాబు చేతుల మీదుగా కమిటీ సభ్యులు ఉద్యోగుల సంక్షేమభవన్ నూతన చైర్మన్ నియామక పత్రాన్ని రాజుబాబుకు అందించి, అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరి సహాధ్యక్షులు డి శ్రీనివాస్, కోశాధికారి ఎం ఆనంద్ కుమార్, కార్యనిర్వాహణ కార్యదర్శి జయప్రకాష్, ఉపాధ్యక్షులు ఎన్ ఆర్ యం రాజు, రాకేష్ మధుకర్, బాలరాజు, సంయుక్త కార్యదర్శి రమాదేవి అనురాధ, బినాకుమారి, అనిత, జోనల్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమోహన్ యం రాజుబాబు, శ్రీనివాసరావు, లక్ష్మీకర్ రెడ్డి, పైడిరాజు, జోనల్ నాయకులు రాజశేఖర్, రాధాకృష్ణ, భరత్ కుమార్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *