విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జన్మదినోత్సవం సందర్భంలో అంతర్జాతీయ స్థాయిలో విధ్యను అందించేందుకు గాను CBSC సిలబస్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని స్కూల్స్ లో మొత్తం 4227 మంది 8వ తరగతి విద్యార్థులకు గాను నగరం లోని మూడు సర్కిల్స్ లోని పశ్చిమ నియోజకవర్గంలో గాంధీజీ మున్సిపల్ స్కూల్, సెంట్రల్ నియోజకవర్గంలో AKTPMC హైస్కూల్ సత్యనారాయణపురం, తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక APSRMC హై స్కూల్ నందు 8వ తరగతి విద్యార్థులకు మొత్తం 524 ట్యాబ్ ల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి సభ్యులు MD. రుహుల్లా, అస్దిస్టెంట్ కమీషనర్ వెంకారేశ్వరరావు, స్కూల్ సూపెర్వైసర్ Md.హుస్సేన్, ప్రధానోపాధ్యాయులు Smt.నీరజ గారితో కలిసి వన్ టౌన్ లోని గాంధీజీ మున్సిపల్ స్కూల్ ఈ కార్యక్రమంలో పాల్గొని 8వ తరగతి విద్యార్థులకు మొత్తం 64 ట్యాబ్ ల పంపిణి చేయడం జరిగినది.
జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు, DEO NTR జిల్లా CV. రేణుక, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి, 33 వ డివిజన్ కార్పొరేటర్ వల్లూరి ఎన్.డి.ఎస్.ఎస్.మూర్తి, 63 వ డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, AKTPMC హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు S.శ్రీనివాస్, సూపెర్వైసోర్ Sk.సైదా గారితో కలిసి సత్యనారాయణపురం లోని AKTPMC హైస్కూల్ ఈ కార్యక్రమంలో పాల్గొని 8వ తరగతి విద్యార్థులకు మొత్తం 370 ట్యాబ్ ల పంపిణి చేయడం జరిగినది.
తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం, కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అడపా శేషగిరి, 21 వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల నరస కుమారి, 22 వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, జోనల్ కమిషనర్ డా. ఏ.రవిచంద్, ప్రధానోపాధ్యాయులు రమేష్ గారితో కలిసి కృష్ణలంక APSRMC హై స్కూల్ ఈ కార్యక్రమంలో పాల్గొని 8వ తరగతి విద్యార్థులకు మొత్తం 70 ట్యాబ్ ల పంపిణి చేయడం జరిగినది.
Prajavartha Online Telugu News