Breaking News

జిల్లాలో డిసెంబర్ 31 వరకు ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది

-జిల్లాలో ఇప్పటికే నూరుశాతం పూర్తి చేసిన కొనుగోలు కేంద్రాలు రెండు రోజుల్లో మూసి వెయ్యడం జరుగుతుంది
-రబీ సీజన్ కోసం ఈ క్రాప్ నమోదు ప్రారంభించనున్నాం
-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం పంట కోత పనులు దాదాపు పూర్తి అవుతున్నాయాని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో అంచనా వేసిన వరి సేకరణ 3.23 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఈ రోజు న (21.12.2022) 1390.240 మెట్రిక్‌ టన్నులధాన్యం సేకరణ జరిగినట్లు ఇప్పటివరకు 35578 మంది రైతుల నుంచి 1,99,297.000 మెట్రిక్‌ టన్నులధాన్యం సేకరణ చేశామన్నారు. రైతులకు రూ.152.68 కోట్లు మేర చెల్లింపు లు చేశామన్నారు.

ఇప్పటికే జిల్లా పరిధిలో సీతానగరం, కోరుకొండ, గోకవరం మండలాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో 100% ధాన్యం కోతలు పూర్తి చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత కొనుగోలు కేంద్రాల మినహా మిగిలిన మండలాల్లో రెండు, మూడు రోజులలో అర్భికెల వద్దనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఆయా మండలాల్లో మొత్తంలో రెండు, మూడు చోట్ల మాత్రమే అర్భికే ల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలు డిసెంబర్ 31 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కనుక తొందరగా ధాన్యం విక్రయించు కోవాలని జేసీ విజ్ఞప్తి చేశారు. రబీ సీజన్ పనుల దృష్ట్యా జిల్లాలో మిగిలిన అన్ని అర్భికే వద్దనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా డిసెంబర్ 31 నాటికి లక్ష్యాలు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారులు స్పష్టం చేశారన్నారు. ఆ నేపథ్యంలోనే రైతులు వారి వద్ద ఉన్న ధాన్యం వివరాలు వెంటనే అర్భికే లలోని కోనుగోలు కేంద్రం సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలని తెలియ చేశారు. ఆ దిశలో రైతులు తమ ధాన్యాన్ని 17% తేమ వరకు ఆరబెట్టుకోవాలన్నారు. వారి ధాన్యాన్ని విక్రయించడానికి తేదీ, సమయాన్ని ఆయా కొనుగోలు కేంద్రం సిబ్బంది తెలపడం తో పాటుగా షెడ్యూల్ చెయ్యడం, అవసరమైన గన్నీలు మరియు రవాణా తదితర ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపట్టడం జరిగిందని తేజ్ భరత్ పేర్కొన్నారు. రబీ సీజన్ కోసం రైతులు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ఈ క్రాప్ బుకింగ్ నమోదు కోసం సిబ్బంది క్షేత్ర స్థాయి లో డేటా సేకరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు.

జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం కు సంబందించి మంగళవారం నాటికి రైతుల ఖాతాలలోకి రూ. 152.68 కోట్ల మేర సొమ్మును జమ జరిగిందన్నారు. ఏవైనా సందేహాల కొరకు జిల్లా కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబర్లు 8309487151 మరియు 08832940788 నకు  ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంప్రదించండని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *