రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్ గవర్నెన్స్ వీక్ (Good Governance week ) కార్యక్రమంలో భాగంగా ది. 21-12-2022 తేదీన కలెక్టరేట్ నందు బుధవారం ఆరోగ్య శాఖ పై కార్యశాల నిర్వహించగా, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశనం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ గారు ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలు రాష్ట్రం ఏ స్థానంలో ఉన్నవి .. ఎనిమియా – ముక్తి భారత్ కార్యక్రమంలో స్కూల్ నందు, హాస్టల్స్, జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రదేశాల్లో రక్త పరీక్షలు ద్వారా ఎనిమియా ఉన్నవారిని గుర్తించి సచివాలయం సిబ్బంది ఏఎన్ఎం, వాలంటీర్లు వద్ద ఉన్న యాప్ లో ఎప్పటి కప్పుడు వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. తదుపరి ఎనిమియా ఉన్న వారిని గుర్తించి వారికి ఇవ్వవలసిన న్యూట్రిషన్ , సప్లిమెంట్ మాత్రలు ద్వారా వారికి రక్తహీనత తగ్గించే దిశగా కార్యచరణ అమలు చేయడం ముఖ్యం అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని తేజ్ భరత్ పేర్కొన్నారు. ఆ దిశలో వైద్య ఆరోగ్య సిబ్బంది అందించే సేవలలో గుడ్ గవర్నెన్స్ ప్రాముఖ్యత ను గుర్తించి అధికారులు తమ భాద్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా 10 నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న కౌమార దశ వారకి , 15 నుంచి 49 సంవత్సరాల వారికి, గర్బిణి గల వారికి, స్త్రీలు అందరికీ రక్తహీనత తగ్గించే విధంగా చూడాలని తెలియజేశారు. 100 % ఆసుపత్రి ప్రసవాలు జరగాలని, సహజ ప్రసవాలు జరగాలని, సిజేరియన్ ఆపరేషన్ తగ్గించే విధంగా చూడాలని, PC&PNDT యాక్ట్ సమర్థవంతంగా అమలయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఆరోగ్య పరంగా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ( SDG)) 100 % చేరుకునే విధంగా ఉండాలన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ వంటి అన్ని ఆరోగ్య కార్యక్రమాలు 100% అమలు అయ్యే విధంగా ఉండాలని తెలియజేశారు. ఏ రాష్ట్రంలో లేనీ విదంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుచున్న ఫ్యామిలీ ఫిజీషియన్ ట్రయల్ రన్ కార్యక్రమంలో ఉన్న విషయాలపై చర్చించి, మెరుగుపరిచే విధంగా సూచనలు చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డి ఎమ్ హెచ్ ఓ డాక్టర్ కే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించే విధంగా కార్యచరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ పై ప్రణాళికలపై క్షేత్ర స్థాయి లో అమలు చేయడం పై కార్యాచరణ రూపుదిద్ది చర్చించినట్లు పేర్కొన్నారు.
డాక్టర్ సనత్ కుమారి, డి . సి .హెచ్. ఎస్, మాట్లాడుతూ మాతృ సంరక్షణ చర్యలకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ పెట్టినట్లు అందులో పోస్ట్ చేసిన వెంటనే గర్భిణీ ఇబ్బందులు తక్షణ స్పందించే లాగున చూస్తామని గర్భిణీ పది రోజులు ముందుగా బర్త్ ప్లాన్ చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు. గుర్తించబడిన వారి డేటా మేరకు మ్యాపింగ్ చేపట్టి ఏ రోజున ఆసుపత్రి లో జాయిన్ అవ్వాలో తెలియజేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ . వసుంధర, డి .ఎల్ .ఏ. టి .ఓ., మాట్లాడుతూ అన్ని TB కేసులకు మందులు పూర్తిగా మింగే విధంగా చూడాలని లెప్రసీ కేసులకు ఇంటింటి సర్వే జరిగినట్లు హెచ్ఐవి టెస్ట్ లను గర్భిణీలు, ఇతరులుకు పరీక్షలు జరిగే విధంగా చూస్తామని తెలియజేశారు.
ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీమతి ప్రియాంక మాట్లాడుతూ 2007 సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ప్రారంభమైనదని, కొత్తగా ఆరోగ్య ఆసరా పథకం ఏర్పాటు చేయబడిందని , వారు నేషనల్ బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ ను డిశ్చార్జ్ అయ్యే లోపు ఇవ్వాలని తెలియజేశారు . ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఇప్పుడు సుమారు 3255 సేవలు ఈ పథకంలో చేర్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనిన డాక్టర్లు , ఎం హెచ్ ఎల్ పి లు, హెల్త్ సూపర్వైజర్స్, మేల్, ఫిమేల్ ఆరోగ్య కార్యకర్తలు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News