Breaking News

నగరానికి కొత్త కాంతులు

-పాత ఎల్.ఈ.డి. లూమినర్స్ స్థానంలో నూతన 180 వాట్స్ సామర్ధ్యంగల లూమినర్స్
-కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రధాన రహదారుల్లో మెరుగైన లైటింగ్ ఉండేలా వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. బుధవారం కమిషనర్  ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్. సర్కిల్ నుండి మణిపురం వంతెన వరకు ఉన్న ప్రస్తుతం ఉన్న 135 వాట్స్ సెంట్రల్ మీడియన్స్ ఎల్.ఈ.డి. లూమినర్స్ స్థానంలో 180 వాట్స్ లూమినర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, జనాభా దృష్ట్యా రాత్రి వేళల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించుటలో భాగంగా వీధి దీపాల సామర్ధ్యాన్ని పెంచి, మెరుగైన కాంతివంతమైన రహదారులను అందించుటకు జిఎంసి కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు. మహా నగరపాలక సంస్థల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విధానంను జిఎంసిలో అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రస్తుతం మంచు కురవడం వలన వీధి దీపాల లైటింగ్ సరిపోక వాహనదార్లు ఇబ్బంది పడుతుండటం గమనించి, మెరుగైన లైటింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. అందులో భాగంగా తొలివిడతగా ఎన్.టి.ఆర్. సర్కిల్ నుండి మణిపురం వంతెన వరకు 135 వాట్స్ తో ఉన్న 26 లూమినర్స్ స్థానంలో నూతనంగా 180 వాట్స్ కెపాసిటి లూమినర్స్ ని ఏర్పాటు చేశారన్నారు. దశల వారీగా నగరంలో ప్రధాన రహదారుల్లో కూడా వీధి దీపాల లూమినర్స్ కెపాసిటి పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *