Breaking News

రాజకీయరంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు జరగాలి… : గాంధీ నాగరాజన్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్త్రీల పై అహింస పాలనకు ఉద్యమిస్తాం… స్త్రీలను గౌరవించే పుణ్యపురుషులతో జతకడతాం… అవినీతి రాజకీయాలను అరికడతాం… స్వతంత్ర సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు అయిన నేటికీ అంబేద్కర్ గాంధీ కలలు కన్న స్వరాజ్యం రాలేదని మహిళలకు రాజకీయ రంగంలో 33 శాతం రిజర్వేషన్ అమలు జరగాలని గాంధీయవాది గాంధీ నాగరాజన్ అన్నారు. విజయవాడ లోని గాంధీ ట్రస్టులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ రంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాలని డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలియజేశారు. ఈ నిరాహార దీక్షకు మహిళల వద్ద నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని అన్నారు. ఇదే విషయమై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మంది ఎంపీలకు రాజకీయ రంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని వినతి పత్రాలు అందజేయడం జరిగిందని చెప్పారు. వినతి పత్రాలు అందుకున్న ఎంపీ లందరూ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రానున్న రోజుల్లో కళాశాలలకు, పాఠశాలలకు, మహిళా సంఘాల వద్దకు వెళ్లి పార్లమెంటుకు ఉత్తరాలు వ్రాసే విధంగా మహిళలను ప్రోత్సహిస్తామని వివరించారు. భారత దేశంలోని ప్రతి రాష్ట్రం లో 21 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.అంబేద్కర్, మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దేశానికి రక్షణగా ఉంటాయని అన్నారు. నేడు రాజకీయాల్లో విలన్లను గెలిపిస్తున్నారని నిరాశ వ్యక్తం చేశారు. ఓటుని నమ్ముకుని బ్రతకాలి, అమ్ముకొని కాదని ఓటర్లకు సూచించారు. గాంధీ నాగరాజన్ తో పాటు విద్యార్థిని బంగారు భారతి స్త్రీలకు అన్ని రంగాలలో 33 శాతం రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలు జరగాలని పాల్గొన్నారు. భారతి మాట్లాడుతూ స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ పూర్తిస్థాయిలో అమలు జరిగే వరకూ పోరాడతానని చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తనకు స్వాగతం పలికిన మహిళలు, విద్యార్థిని విద్యార్థులకు ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీదేశం ట్రస్ట్‌ సభ్యులు ఆర్‌.శివరంజని తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *