Breaking News

విజయవాడ డివిజన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

-విజయవాడ -గూడూరు సెక్షన్‌లో జనరల్ మేనేజర్ తనిఖీ చేపట్టారు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు అనగా తేదీ 22 డిసెంబర్ 2022 న విజయవాడ – గూడూరు సెక్షన్‌లో వార్షిక తనిఖీ చేపట్టారు. జనరల్ మేనేజర్ తో పాటు శివేంద్ర మోహన్, విజయవాడ డివిజన్‌ డివిజనల్ రైల్వే మేనేజర్, వివిధ శాఖల ప్రధాన అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

జనరల్ మేనేజర్ కృష్ణా కెనాల్ – తెనాలి సెక్షన్ మధ్య మొదటగా లెవెల్ క్రాసింగ్ (ఎల్ సి ) నం.306 నుండి తనిఖీని ప్రారంభించారు . ఎల్ సి గేట్ వద్ద భద్రతా అంశాలను పరిశీలించారు. విధుల్లో ఉన్న గేట్‌మెన్‌తో సంభాషించారు. అనంతరం జనరల్ మేనేజర్ తెనాలి రైల్వే స్టేషన్ మాస్టర్ గదిని తనిఖీ చేసి స్టేషన్ ప్యానెల్ బోర్డ్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగ భద్రతకు సంబంధించిన విధి,విధానాలపై స్టేషన్ మాస్టర్‌తో సంభాషించారు. స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఆర్‌పిఎఫ్ పోస్ట్ మరియు సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ కార్యాలయల సముదాయాన్ని తెనాలి స్టేషన్ లో వర్చూల్ విధానంలో ప్రారంభించారు. తదుపరి బాపట్ల రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన జనరల్ మేనేజర్ పర్యావరణాన్ని ప్రోత్సహించే దిశలో భాగంగా చెట్లను నాటే కార్యక్రమంలో పాల్గొని అటు పిమ్మట రైల్వే క్వార్టర్స్ పరిశీలించారు. కోన రఘుపతి, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే  జనరల్ మేనేజర్‌తో సమావేశమై బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన రైల్వేల అభివృద్ధికి సంబందించిన అంశాలపై చర్చించారు. చీరాల రైల్వేస్టేషన్‌లో మూడవ లైన్ కు సంభవించిన పురోగతి పనులను పరిశీలించారు. జనరల్ మేనేజర్ చిన్నగంజాం – ఉప్పుగుండూరు సెక్షన్ మధ్య ప్రధాన బ్రిడ్జిను పరిశీలించి తదుపరి ట్రాక్ వేగ సామర్ధ్య పరీక్షను నిర్వహించారు.

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో అరుణ్ కుమార్ జైన్ రోలింగ్ స్టాక్ ఎగ్జామినేషన్ హట్ (క్యారేజ్ & వ్యాగన్ డిపార్ట్‌మెంట్)ని మరియు విజయవాడ స్టేషన్ ప్యాసింజర్స్ సౌకర్యాల యాప్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ యాప్‌ను వర్చూల్ విధానంలో ప్రారంభించారు. దీనితో పాటు న్యూస్ క్లిప్పింగ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మరియు ఫిర్యాదులకు సంబంధించి సూచనలు మరియు వినతుల నిర్వహణ వ్యవస్థ ను ప్రారంభించారు . విజయవాడ డివిజన్ చేసిన వినూత్న/ చేపట్టిన వివిధ మంచి పనులతో కూడిన స్టాల్‌ను సందర్శించారు. డివిజినల్ రైల్వే మేనేజర్ ఈ -కనెక్ట్‌ త్రైమాసిక రైల్వే త్రైమాసిక పత్రిక సంబంధించి జనరల్ మేనేజర్ కు వివరించారు . అనంతరం అభివృద్ధిచేసిన గూడ్స్‌ షెడ్‌ను పరిశీలించారు. హెల్త్ యూనిట్ ను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి, హెల్త్ యూనిట్ ఆవరణలో మొక్కలు నాటారు. జనరల్ మేనేజర్ సింగరాయకొండ వద్ద ట్రాక్ మెయింటైనర్స్, గ్యాంగ్ యూనిట్ నెం 2 తో సంభాషించారు. అలాగే సింగరాయకొండ – ఉలవపాడు సెక్షన్ మధ్య కొత్తగా నిర్మించిన ఎల్‌సి కమ్ రిలే రూమ్ ను తనిఖీ చేసారు .

బిట్రగుంట రైల్వే స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ బాహ్య ఆవరణ ప్రాంగణంలో మొక్క నాటారు.  అనంతరం క్యారేజీ మరియు వాగన్ (సి & డబ్ల్యూ) డిపో వద్ద బ్రేక్ పవర్ సర్టిఫికేషన్ కోసం 50 హెచ్ .పి ఎయిర్ కంప్రెసర్ యూనిట్‌ను ప్రారంభించారు . అలాగే క్రూ లాబీని పరిశీలించి మరియు రన్నింగ్ రూమ్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను తనిఖీ చేసారు. ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే, కావలి నియోజకవర్గం  అరుణ్ కుమార్ జైన్‌తో సమావేశమై నియోజక వర్గనికి సంబంధించిన రైల్వే అభివృద్ధికి సంబందించిన సమస్యలపై చర్చించారు.

నెల్లూరు రైల్వేస్టేషన్‌లో నూతనంగా నిర్మించిన ఆర్‌పిఎఫ్‌ పోస్టును అరుణ్‌కుమార్‌ జైన్‌ ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన స్పెషల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కార్యాలయ భవన సముదాయాన్ని పరిశీలించి, స్టేషన్‌ అభివృద్ధి ప్రణాళికలపై రైల్వే అధికారులు, నిర్వహణ సంస్థలతో చర్చించారు. అలాగే ఇందుకు సంబందించిన పనుల పురోగతిని అయన పరిశీలించారు.

ఈ తనిఖీ సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు జనరల్ మేనేజర్‌ను కలుసుకుని ప్రయాణికుల సౌకర్యాలు, హాల్ట్‌ల ఏర్పాటు, కొత్త రైళ్లు ప్రవేశపెట్టేందుకై వారు తమ వినతులను జనరల్ మేనేజర్ కు సమర్పించారు. జనరల్ మేనేజర్ తదుపరి మీడియా ప్రతినిధులతో కూడా సంభాషించారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్నపలు అభివృద్ధి ప్రణాళికలను వారికి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *