Breaking News

స్పై- ఫై సాంకేతికతతో విజయవంతంగా 75 సెంటినల్ నోడ్ బయాప్సీ సర్జరీలు నిర్వహించిన మణిపాల్ హాస్పిటల్ విజయవాడ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించి మణిపాల్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. సుమారు 75కు పైగా సెంటినల్ నోడ్ బయాప్సీ సర్జరీలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. మొట్ట మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో స్పై- ఫై (ఇమ్మ్యూనో ఫ్లోరోసేన్స్ టెక్నాలజీ) సాంకేతికతను మణిపాల్ హాస్పిటల్ లో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ ఆగ్జీలరీ లింఫ్ నోడ్స్ కి పాకిందో లేదో తెలుసుకోవటం కోసం ఇమ్మ్యూనో ఫ్లోరోసేన్స్ పద్ధతితో సెంటినల్ నోడ్ ని గుర్తించి, దానిని వెంటనే ఫ్రోజెన్ సెక్షన్ చేసుకుని దానిలోకి క్యాన్సర్ వ్యాప్తి చెందకపోతే ఆగ్జీలరీ డిసిక్షన్ ను చేయకుండా తప్పించవచ్చు. దీని వల్ల చేతికి సంబంధిచిన దుష్పరిణామాలు అయిన చేయి వాపు, చేయి నొప్పి, నరాలు దెబ్బ తినటం వంటివి తగ్గించవచ్చు. దీనిని 100% తో విజయవంతంగా మణిపాల్ హాస్పిటల్ నందు నిర్వహిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కి కావలసిన అత్యాధునిక పరికరాలు & పద్ధతులు మణిపాల్ నందు లభ్యమని అయన తెలిపారు.

విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దినేశ్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘Spy-Phi అనేది ఎంతో ప్రత్యేకమైన టెక్నాలజీ అని అన్నారు. ఈ అత్యంత అధునాతనమైన ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్ టెక్నాలజీను చాలా రకాల క్యాన్సర్ చికిత్సలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మణిపాల్ హాస్పిటల్స్ SPY-PHI సాంకేతికతను కలిగి ఉండడంతో విజయవాడ పరిసర జిల్లాల ప్రజలు దీన్ని ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతోంది అని అన్నారు.

మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ డైరెక్టర్‌, డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ, “విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్స్‌ 75 సెంటినల్ నోడ్ బయాప్సీ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి 100% సక్సెస్‌ రేట్‌ను సాధించిందని పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ మైలురాయిని సాధించినందుకు డాక్టర్ వి. ధర్మేంద్ర కుమార్, డాక్టర్ దినేష్ రెడ్డికి నా అభినందనలు” అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *