Breaking News

స్పందన అర్జీలకు నిర్ణిత గడువులోగా పరిష్కారం చూపాలి…

-జిల్లాలో 47 అర్జీల నమోదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిప్యూటీ కలెక్టర్ వి. జ్యోతి సురేఖ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీలకు నిర్ణిత గడువులోగా సంబంధిత శాఖల అధికారులు పరిష్కారం చూపాలన్నారు. కొందరు అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించక పరిష్కారంలో అలసత్వం వల్ల కొన్ని అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయని అటువంటి అర్జీలు రీ ఓపెన్ కాకుండా ప్రాధమిక స్థాయిలోనే అర్జీలను నిశితంగా పరిశీలించి పరిష్కరించినట్లైతే అర్జీ దారుడు సంతృప్తి చెందుతారన్నారు. అర్జీలను స్థానికంగానే పరిష్కరించినట్లైతే జిల్లా స్థాయి వరకు వచ్చే అవసరం ఉండదన్నారు. ప్రతి సోమవారం డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే స్పందనపై ప్రచారం చేయాలన్నారు. అర్జీలను పరిష్కరించిన వెంటనే విచారణ చేసిన అధికారి అర్జీదారునితో ఫోటో అప్లోడ్ చేయాలన్నారు. తిరువూరు మండలం గానుగపాడు గ్రామానికి చెందిన గోలి శారదా కుమారి అర్జీ ఇస్తూ తనకు చెందిన రెండు ఎకరాల పదకొండు సెంట్ల భూమికి సంబంచించి కొలతలు తప్పుగా నమోదయ్యాయని దీనిపై సర్వే చేసి భూమి కొలతలు నిర్ధారించాలని కలెక్టర్ ఢిల్లీరావు కు అర్జీ ఇవ్వగా తక్షణమే తిరువూరు ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, మండల తహసీల్ధారుతో వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి అర్జీ దారుని భూమిని సర్వే చేయాలని అక్కడికక్కడే ఆదేశించారు. నేటి స్పందనలో నమోదైన 47 అర్జీలలో రెవిన్యూ 13, పోలీస్ 14, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 3, పంచాయితీ రాజ్ 4, వైద్య ఆరోగ్య శాఖ, దేవాదాయ, ఉపాధికల్పన శాఖలకు రెండేసి అర్జీలు, సి ఆర్ డి ఏ, డిసబుల్డ్, హ్యాండ్లూమ్స్, వ్యవసాయ, మత్స్య , డి ఆర్ డి ఏ శాఖలు, గ్రామా వార్డు సచివాలయం, బ్యాంకు రుణాలకు సంబంధించి ఒక్కొక్క దరఖాస్తు నమోదయ్యాయని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. స్పందనలో డ్వామా పిడి జె. సునీత, అన్ని శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *