Breaking News

అంగన్ వాడి కార్యకర్త, సహాయకురాలు పోస్టుల భర్తీ

– సిడిపిఓ జి. మంగమ్మ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఎన్ టి ఆర్ జిల్లా పరిధిలోని ఐ సిడి ఎస్ ప్రాజెక్టు – 2 నందు ఖాళీగా ఉన్న అంగన్ వాడి కార్యకర్త, సహాయకురాలు పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరుతున్నట్లు సి డి పి ఓ జి. మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఐ సి డి ఎస్ ప్రాజెక్టు -2 తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల పరిధిలో అంగన్ వాడి కార్యకర్త, సహాయకురాలు పోస్టుల భర్తీకి సంబంధించి తూర్పు నియోజకవర్గం లోని జార్జి పేట నందు అంగన్ వాడి కార్యకర్త పోస్టుకు బి.సి. (బి) క్యాటగిరిలో, జార్జి పేట నందు అంగన్ వాడి సహాయకురాలు పోస్టుకు ఓ.సి. క్యాటగిరిలో, బాడవ పేట ఎస్.సి. క్యాటగిరిలో, బి ఎన్ ఆర్ నగర్ (1) బి.సి.(డి) క్యాటగిరి, బాలాజీనగర్-3, ఆటో నగర్ -1, గుణదల-4, కార్మిక నగర్, భాస్కరరావు పేట నందు ఓ.సి. క్యాటగిరీలలో, క్రిస్టియన్ పేట ఎస్.సి. క్యాటగిరి లోను సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని విజయదుర్గా నగర్, మారుతి నగర్ నందు బి.సి. (బి) క్యాటగిరి, అరండల్ పేట నందు బి.సి. (ఏ) క్యాటగిరి లలో రోస్టర్ ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అంగన్ వాడి కార్యకర్త సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు స్థానికురాలైన వివాహిత మహిళలు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 1-7-2022 నాటికి 21 సంవత్సరాలు నిండి, 35 సంవత్సరాలు లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు కులధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువ పత్రం, ఆధార్, రేషన్ కార్డు జతచేయాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ కార్యాలయము నందు మాత్రమే దరఖాస్తు ఫారములను పొందవలసి ఉంటుందన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారములను జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ కార్యాలయం నందు సమర్పించాలని, ఇతర వివరములు 9440814596 నందు సంప్రదించాలని సి.డి. పి. ఓ. మంగమ్మ ఆ ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *