విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది పర్యావరణ పరిరక్షణలో రోజ్ సొసౖౖెటీ ఆప్ ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యులు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
నగరపాలక సంస్థ, హరిత ప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ, రోజ్ సొసౖౖెటీ ఆప్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక సిద్దార్థా హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రాగణంలో ఏర్పాటు చేసిన ఆరవ రాష్ట్ర స్థాయి అగ్రి ఆర్టి కల్చర్ షో, ఐదవ వార్షిక గులాబి ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ నగర ప్రజలకు వివిధ రకాల గులాబీలు, పూలమొక్కలపై చూడముచ్చటగా కనువిందుచేసే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వహకులు అభినందనీయులన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ నగరాన్ని గ్రీన్ సీటీగా తీర్చిదిద్దిడంలో రోజ్ సొసౖౖెటీ ఆప్ ఆంధ్రప్రదేశ్ సహకరించాలని కోరారు. బెంగళూరు, కలకత్తా నగరాలలో ప్రదర్శనలో ఉండే పలు రకాల గులాబీలు ప్రదర్శనలో ఉంచడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థ సహకారంతో నగరంలోనే వివిధ మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరపాలక సంస్థ పచ్చదనానికి ప్రాముఖ్యతను ఇస్తూ ప్రధాన రహదారుల వెంబడి బ్యూటిఫికేషన్ చేస్తూ నగరప్రజలకు కనువిందు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే బెంజ్‌సర్కిల్ వద్ద నుండి ప్రధాన రహదారులకు ఇరువైపుల పెయింటింగ్, అందమైన మొక్కలతో ఆహ్లాదకరంగా రూపొందించామన్నారు. నగరంలోని రాజీవ్‌గాంధీ పార్కులో రకరకాల పూల మొక్కలను నాటి నగర ప్రజలకు కనువిందు చేస్తున్నామన్నారు. రానున్న మూడు నెలలో నగరంలోని ప్రధాన రహదారులకు ఇరువైపుల 100 మిల్లింగ్టోనియా, జాఫ్రా వంటి పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రణాళిక రూపొందించిందన్నారు. దక్షిణాఫ్రికా రాజధాని జోహన్సబర్గ్ లో బ్లూమింగ్ చెట్ల ఫ్లవరింగ్‌తో గొప్ప పర్యాటక కేంద్రంగా ప్రసిద్ది చెందిందన్నారు. చండీఘడ్, డిల్లీలోని సౌత్ పటేల్ నగరంలో ఉన్న బిపి పాల్ రోజ్ గార్డెన్‌లను ప్రతీ ఒక్కరూ సందర్శిస్తే అవగాహన కలుగుతుందన్నారు. గులాబీలను ప్లాంటింగ్‌లో పెంచే విధానంపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా గులాబీ మొక్కలకు అధిక నీరు వాడడం వల్ల బ్లాక్ స్పాట్స్ వంటి వ్యాధులకు గురి అవుతాయన్నారు. క్రిమిసంహారిక మందుల వాడడంలోను జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ మాట్లాడుతూ నగర ప్రజలను కనువిందు చేసేలా నాలుగు రోజుల పాటు వివిధ రకాల గులాబీలు, పూలమొక్కలతో ప్రదర్శన ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. నగరాన్ని బ్యూటిఫికేషన్ చేయడంలో రోజ్ సొసౖౖెటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారం అందించాలని కోరారు.
గార్డెన్ వరల్డ్, హైబ్రీడ్ చామంతుల గణపతి గార్డెన్, ఎస్‌విఆర్ గార్డెన్‌లలోని పూలమొక్కలు, సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శనలతో 70కి పైగా స్టాల్స్ సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.
కార్యక్రమంలో డిసిపి మేరీ ప్రశాంతి, మాజీ పార్లమెంట్ సభ్యులు, లైలా గ్రూప్ సంస్థ చైర్మన్ గోకరాజు గంగరాజు, రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జిఎస్‌ఆర్ మోహన్‌రావు, సెక్రటరీ ఎన్. పద్మప్రియ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News