విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 2023 జనవరి 1 నాటికి 16 లక్షల 31 వేల 883 తుది ఓటర్లుగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో 8 లక్షల 770 మంది పురుషులు, 8 లక్షల 30 వేల 958 మంది స్త్రీలు, 155 మంది థర్డ్ జెండర్‌గా మొత్తం 16 లక్షల 31 వేల 883 తుది ఓటర్లుగా ఉన్నారన్నారు. వీరిలో తిరువూరు నియోజకవర్గంలో 1లక్ష 54 మంది పురుషులు, 1లక్ష 16 వేల 53 మంది స్త్రీలు, 8 మంది థర్డ్ జెండర్లు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 1లక్ష 20 వేల 460 మంది పురుషులు, 1లక్ష 21 వేల 670 మంది స్త్రీలు, 34 మంది థర్డ్ జెండర్లు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 1లక్ష 30 వేల 698 మంది పురుషులు, 1లక్ష 35 వేల 752 మంది స్త్రీలు, 60 మంది థర్డ్ జెండర్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లక్ష 32 వేల 145 మంది పురుషులు, 1లక్ష 35 వేల 989 మంది స్త్రీలు, 20 మంది థర్డ్ జెండర్లు, మైలవరం నియోజకవర్గంలో 1లక్ష 28 వేల 260 మంది పురుషులు, 1లక్ష 34 వేల 781 మంది స్త్రీలు, 13 మంది థర్డ్ జెండర్లు, నందిగామ నియోజకవర్గంలో 94 వేల 429 మంది పురుషులు, 99 వేల 728 మంది స్త్రీలు, 9 మంది థర్డ్ జెండర్లు, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 94 వేల 724 మంది పురుషులు, లక్ష 1 వెయ్యి 385 మంది స్త్రీలు, 11 మంది థర్డ్ జెండర్లు ఓటర్లగా ఉన్నారని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
Tags vijayawada
Check Also
వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి
-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …
Prajavartha Online Telugu News