విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోస్తాంధ్ర జిల్లా కలెక్టర్లతో ఈనెల 6వ తేది శుక్రవారం స్థానిక లెమన్ ట్రీ హోటల్ నందు రెవెన్యూ శాఖ సదస్సునిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. గురువారం లెమన్ ట్రీ హోటల్ నందు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు, సిసిఎల్‌ఏ ఉన్నతాధికారులు, కోస్తాంధ్ర కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, డివిజనల్ అధికారులు పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ సదస్సులో భూముల రీసర్వే, రెవెన్యూ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై సమీక్షిస్తారని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
Prajavartha Online Telugu News