Breaking News

ఈనెల 25వ తేదీ లోపున ఆశించిన స్థాయిలో గృహ నిర్మాణంలో పురోగతి లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఈనెల 25వ తేదీ లోపున ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను హెచ్చరించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తో కలిసి మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతిపై సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అధికారులతో సమీక్షించి గృహ నిర్మాణాల పురోగతి అత్యల్పంగా ఉన్న మండలాలో వాస్తవ స్థితిగతులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ, నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిలో అశ్రద్ధ జాప్యం, ఆదేశాల అమలులో కనబరుస్తున్న నిర్లక్ష్యాన్ని తక్షణమే విడిచి పెట్టాలన్నారు. సచివాలయాల వారీగా కేటాయించిన వారాంతపు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలను అలక్ష్యం చేయకుండా కేటాయించిన లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా అన్ని దశలలో పురోగతి తీసుకురావాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మిగిలిన గృహాలను అన్ని స్టేజిల్లో పూర్తి చేసేందుకు నియోజకవర్గ స్పెషల్ అధికారులు, హౌసింగ్ అధికారులు, సంబంధిత మండల తాసిల్దారులు, ఎంపీడీవోలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణాల విషయంలో అత్యల్ప స్థాయిలో పురోగతి పెదపారుపూడి మండలం చూపిందని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. వారాంతపు లక్ష్య ప్రగతిలో పలు సచివాలయాలు వెనుకబడి వున్నాయని, ఆ విధంగా ఎందుకు ఉన్నాయని అందుగల కారణాలేంటని సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సంబంధిత మండల తాసిల్దార్, ఎంపీడీవోలను కలెక్టర్ ప్రశ్నించారు.
ప్రతి మండలంలో దాదాపు మూడు సచివాలయాల గృహ నిర్మాణాల ప్రగతి లక్ష్యాన్ని సాధించలేదన్నారు. లేఅవుట్లో గృహం నిర్మించుకోవడానికి ఆసక్తి చూపని వారిని గుర్తించి వారికి ఇల్లయినా కట్టుకోవాలి లేదంటే లబ్ధిదారుడు చేత నోటిఫై చేసి నాట్ విల్లింగ్ అని రాయించాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏ ఏ స్టేజిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే జియో ట్యాగింగ్ చేసి, యం.బుక్ లో నమోదు చేయాలన్నారు ఆయా నిర్మాణ దశలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణం ఊపందుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని, ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి స్టేజి అప్డేషన్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్ లను లేఅవుట్లకు ఎప్పటికప్పుడు సరఫరా చేసేలా చూడాలని, సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యం ఇళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేటాయించిన లక్ష్యాలను చేరుకునేలా పని చేయాలని, లబ్ధిదారులకు కూడా నిర్మాణాలపై అవగాహన కల్పించాలన్నారు.
ప్రగతి తక్కువగా ఉన్న సచివాలయాలన్నీ వచ్చే వారానికి ప్రగతి తీసుకురావాలని ఇందుకు సంబంధించి నియోజకవర్గ స్పెషల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రణాళిక లేకుండా ఎలా ప్రగతి చూపిస్తారని సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ వచ్చే వారానికి ప్రగతి చూపిస్తామని చెప్పడంపై ఈ వారం ఏం పని చేశారని అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని అన్నారు. సచివాలయాలకు టార్గెట్ కూడా చాలా తక్కువగా ఉందని చేయలేక పోవడానికి గల కారణాలను తెలపాలని ఆమె ప్రశ్నించారు. రూఫ్ లెవెల్, రూప్ కాస్ట్ స్థాయిలో ఉన్న గృహాలను కూడా పూర్తి చేయలేకపోతున్నారని ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు బిల్లులు అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి వారం నిర్దేశిత ప్రగతిని సాధించాలన్నారు.

ఈ వీడియో సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, డ్వామా పి.డి. జీవి సూర్యనారాయణ, పంచాయతీరాజ్ ఎస్ ఇ ఎం. ఈరాస్వామి, టిడ్కో ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.చిన్నోడు, హౌసింగ్ ఈఈ , మున్సిపల్ కమీషనర్లు, అన్ని మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్లు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ డిఈలు, ఏఈలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *