Breaking News

ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి గారు జే సి డి కే బాలాజీ, డి ఆర్ ఓ శ్రీనివాస రావు తో కలిసి పాల్గొని అధికారులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు వారి సాంప్రదాయాలతో కూడిన పండుగ సంక్రాంతి అని, పల్లెటూళ్ళలో ఎంతో ఘనంగా నిర్వహించు కుంటారని, రైతులకు ముఖ్యమైన పండుగ అని తెలిపారు. పాడి, పంటలతో, పశు సంపద తో రైతులు ఎంతో సంతోషంగా ఇంటిల్లిపాదీ జరుపుకుంటారని, భోగి, సంక్రాంతి, కనుమ గొప్ప పండుగలు అని అన్నారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ తదితర రెవెన్యూ సిబ్బంది పండుగ ప్రాశస్త్యం పై ప్రసంగించారు. అధికారులు సంతోషంగా ఉల్లాసంగా పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలన అధికారి జయరాములు కలెక్టరేట్ రెవెన్యూ సిబ్బంది విజయ భాస్కర్ కిరణ్మయి, కుప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *