రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు జడ్జి గా నియమిస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వం లోని కొలిజయం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేశారు. గురువారం సాయంత్రం జిల్లా జడ్జి బంగ్లా లో కలెక్టర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా , జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ తగు న్యాయ సేవలు అందించే క్రమంలో మీ సేవా భావం మా అందరికీ స్ఫూర్తిని కలిగించాయని పేర్కొన్నారు. జిల్లా జడ్జిని కలిసి అభినందలు తెలియ చేసిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లు ఉన్నారు.
Prajavartha Online Telugu News