Breaking News

సంక్రాంతి పండుగ సందర్భంగా జంతు హింస నిరోధక చట్టం అమలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగ సందర్భంగా జంతు హింస నిరోధక చట్టం అమలు చేయాలని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కోడి పందాలు నిర్వహించుట – పాల్గొనుట చట్ట రీత్యా నేరం ప్రచారాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో జంతు హింస ను అరికట్టే చర్యల్లో భాగంగా జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన 17 మంది తో ఒక కమిటీని గత ఆగస్టు లో ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ముఖ్యం గా సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అటువంటివి జరగకుండా “జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జెడ్పీ సి ఈ వో, జిల్లా ఎస్పీ, పశు సంవర్ధక శాఖ, డిపిఆర్వో, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులతో కూడిన కమిటీ పని చేస్తుందని తెలిపారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై గేమింగ్ యాక్ట్ 1974 లోని సెక్షన్ 10 కింద, జంతు హింస నివారణ చట్టం 1960 సెక్షన్ 34 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా. ఎస్ జి టి సత్య గోవింద్, న్యాయవాది గోపీ కాంత్ , ఎన్ జి వో లి రాజ్‌కుమార్ కటారియా, శైలజ, హారిక, విజయ్ కిషోర్ పాలిక, అధికారిక సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *