Breaking News

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ…

-కలెక్టర్ ఢిల్లీరావు ,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కృష్ణ నదిలో ఈతకు వెళ్లి పటమట దర్శి పేటకు చెందిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు మృతి చెందిన బాధిత కుటుంబాలకు మూడు లక్షలు చొప్పున ప్రభుత్వం తరపున చెక్కులను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ లు అందచేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తూర్పు నియజక వర్గ పరిధిలోని 14వ డివిజన్ పటమట దర్శిపేటకు చెందిన ఐదుగురు యవకులు ఇటీవల కృష్ణ నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉండి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల ఆర్ధిక సహాయం అందించామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేయడం జరిగిందన్నారు. అదే విధంగా 13వ డివిజన్ కి చెందిన షేక్ మీరావలి కుమార్తె ఆశా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు చేసిన 15 లక్షల రూపాయలు చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగిందని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఏ అవసరం వచ్చిన అండగా ఉంటానన్నారు. పేదవారికి ఏ కష్టం వచ్చిన తక్షణమే స్పందించే హృదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. గత నెలలో కృష్ణ నదిలో ఈతకు వెళ్లి దురదృష్టవశాత్తు మరణించిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల ఆర్ధిక సహాయం అందించడం జరిగిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఆ కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని దేవినేని అవినాష్ అన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తహశీల్ధార్ వెంకటరామయ్య, స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్య, స్థానిక నాయకులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *