విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి ప్రత్యేకహోదా, చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వున్ననాడే మనరాష్ట్రం, భారతదేశం అభివృద్దిచెందుతాయని గాంధీదేశం సోషల్‌వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ చెప్పారు. మంగళవారం ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ‘బంగారు’ భారతి జన్మదినవేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్‌చేసి ప్రజలకు మిఠాయిలు పంపిణీచేసారు. అలాగే యజ్ఞ అనే బాలికకు వెండి పట్టీలను భారతి అందచేసారు. ఈ సందర్బంగా గాంధీనాగరాజన్ మాట్లాడుతు దండి యాత్ర – 2 పేరుతో తాను ప్రతినిత్యం చేస్తున్న పాదయాత్ర నేటితో 19 రోజులకు చేరుకుందని చెప్పారు. ప్రతిచోటా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ,ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాలను వివరిస్తున్నట్లు చెప్పారు. తన దండియాత్ర 2కు మంచి స్పందన లభిస్తోందని అన్నారు. కొత్తగా కడుతున్న పార్లమెంట్ భవనంకు మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ ల పేర్లు పెట్టి వారి శిలా విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాంధీ నాగరాజన్‌తో పాటుగా గాంధీట్రస్ట్ మహిళా అధ్యక్షురాలు ఆర్.ఆర్. శివరంజని తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News