Breaking News

తొలి జన్మ అమ్మదైతే పునర్జన్మ హెల్మెట్‌ది…

-వాహన చోదకులు నిబంధనలను తప్పకపాటించేలా చర్యలుతీసుకోండి..
-మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోండి..
-ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాహన చోదకులు తప్పనిసరిగా నిబంధలను పాటించేలా చర్యలు తీసుకోవాలని, మద్యం మత్తులో వాహనాలను నడిపితే లైసెన్స్‌లను రద్దు చేయాలని, జిల్లాలో తరచు జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ఈనెల 18వ తేది నుండి 24వ తేది వరకు నిర్వహించనున్న 34వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి డిఆర్‌ఎస్‌సి చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధ్యక్షత వహించారు.
ట్రాన్స్‌పోర్ట్‌, పోలీస్‌, మెడికల్‌ శాఖలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, శిక్షణ పొందుతున్న డ్రైవర్లు పాల్గొన్న సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో దాదాపు 50 శాతం ద్విచక్ర వాహనాలే కారణమవుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలను పాటించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్లక్ష్యంగా అతివేగంతో వాహనాలను నడిపి, ప్రమాదాలకు గురైన వారు వారి కుటుంబ సభ్యులతో పాటు తోటి ప్రయాణికులను కోలుకోలేని పరిస్థితులకు కారణమవుతున్నారన్నారు. ఇటువంటి వారి పట్ల నిర్థాక్షణ్యంగా వ్యవహరించాలన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే రహదారి భద్రత వారోత్సవాలలో ప్రజలకు ట్రాఫిక్‌ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు.
డిటిసి పురేంద్ర మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్‌ నిబంధనల పట్ల అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులు చేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19వ తేదిన రవాణ శాఖ పోలీస్‌, మోటార్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ఉద్యోగులు విద్యార్థులతో మోటార్‌ వెహికల్‌ అమెండ్మ్‌ట్‌ యాక్ట్‌ పై అవగాహన కల్పించడంతో పాటు ఇన్సూరెన్స్‌ విధానంపై వర్క్‌ షాపు నిర్వహిస్తున్నామని, 20వ తేదిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో రోడ్డు సేఫ్టీ స్కూల్‌ బస్‌ సేఫ్టీ అవగాహన కల్పించడంతో పాటు వాస్యరచన, చిత్రలేఖన పోటీలను, 21వ తేదిన మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించి డ్రైవర్లకు కంటి పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 22వ తేదిన దిచక్ర వాహన ర్యాలీ నిర్వహించి హెల్మెట్‌ వాడకంపై అవగాహన కల్పిస్తామన్నారు. 23వ తేదిన పోలీస్‌, ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు సంయుక్తంగా ట్రాఫిక్‌ సింబల్స్‌ పై అవగాహన కల్పిస్తామన్నారు. 24వ తేదిన రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను నిర్వహించి రోడ్డు భద్రతలో ఉత్తమ సేవలందించిన పోలీస్‌, వైద్యులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖ అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందని డిటిసి పురేంద్ర తెలిపారు.
తొలుత రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రచార వాహనాన్ని, వాల్‌ పోస్టర్లను, బ్యానర్లను కలెక్టర్‌ విడుదల చేసి రోడ్డు భద్రతలో పాలుపంచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు.
సమావేశంలో డిసిపి శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ జాన్‌మోషే, డియంహెచ్‌వో డా.యం సుహాసిని, ఎన్‌జివో బి. రామమోహన్‌రావు, సుదీక్షన్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు చిగురుపాటి విమల తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *