Breaking News

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి…

జగ్గయ్యపేట/ వత్సవాయి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అధికారులను ఆదేశించారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో జాతీయ రహదారి అప్రోచ్ రోడ్ లో అవసరమైన కల్వర్టు నిర్మాణానికి భూసేకరణ, వత్సవాయి మండలం మంగోల్లు గ్రామంలో పోరంబోకు ఆక్రమణలను క్రమబద్ధీకరించే ప్రతిపాదనలు, భూమి మార్పిడి ప్రతిపాదనలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ బుధవారం రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు రెండు ఎకరాల భూమి అవసరం ఉందని, అదేవిధంగా షేర్ మహమ్మద్ పేటలో జాతీయ రహదారి అప్రోచ్ రోడ్ లో కల్వర్టు నిర్మాణానికి చేపడుతున్న భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

వత్సవాయి మండలం మంగోల్లు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్….
మంగోల్లు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు నమోదు,మూమెంట్ రిజిస్టర్ లను జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చాలన్నారు. సచివాలయానికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో జాయింట్ కలెక్టర్ వెంట జగ్గయ్యపేట వత్సవాయి తహసిల్దార్లు నాగేశ్వరరావు వైకుంఠరావు ఎండిఓ ప్రసాద్, పంచాయతీరాజ్,హౌసింగ్ డిఇలు,ఏఇలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అధికారులందరూ ఫీల్డ్‌లోనే ఉండాలి

-వర్షపు నీరు నిలిచిపోవడానికి కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *