విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రమాణస్వీకారం రోజు చెప్పిన మాట ప్రకారం కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్, 59 వ సచివాలయం పరిధిలో ఎన్టీఆర్ సర్కిల్ గంగానమ్మ గుడి దగ్గర నుండి మొదలై శివాలయం రోడ్,ఠాగూర్ టైప్ ఇనిస్టిట్యూట్ రోడ్,రామాలయం రోడ్ ప్రాంతాల్లో పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడపగడపకు వస్తున్న నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతుంటే చాలా సంతోషంగా ఉందని, మేము టీడీపీ లో క్రియాశీలకంగా తిరుగుతున్న సరే ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని, కానీ నేడు వైసీపీ ప్రభుత్వం లో వాలంటీర్లు నేరుగా మా ఇంటి వద్దకే వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చాలా ఆనందంగా ఉందని ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ పటమట ప్రాంతం టీడీపీకి కంచుకోట అని ఆర్భాటంగా ప్రచారం చేసుకొంటారు తప్ప అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2కోట్ల రూపాయల తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందజేసామని సగర్వంగా చెప్పారు. అంతేకాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్, వైస్సార్సీపీ నాయకులు చలపాటి వెంకటేశ్వర రావు, మధు కృష్ణమీనన్, శివన్నారాయణ, దాసరి ఉమా, చిన్నయ్య, వెంకటేశ్వర రావు, ఆంజనేయులు, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News