రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజం, మానవ సంబంధాలుపై వేమన పద్యాలు రాసి 350 సంవత్సరాలు అవుతున్నా నేటికీ ఆదర్శప్రాయం గా నిలుస్తున్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో యోగి వేమన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, సమాజం లోని రుగ్మతలను ధైర్యంగా చాటిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. మానవతా ధర్మం, సర్వమానవ సమానత్వం, కుల విచక్షణ లోని డొల్లతనం, నైతికత్వం అనేక సామాజిక అంశాలను ఆయన పద్యాలు రూపంలో తీసుకుని రావడం జరిగిందన్నారు. 1652 – 1730 మధ్య జీవించినట్లు చారిత్రక కథనాలు ప్రచారంలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేమన జయంతిని అధికారికంగా నిర్వహించు కోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు మాట్లాడుతూ, సత్యసాయి జిల్లా కదిరి మండలం కటారి పల్లె గ్రామంలో వేమన సమాధి ఉందని, మన తెలుగు జాతి ఔనిత్యన్ని ప్రపంచానికి తన రచనలు ద్వారా చాటిన మహోన్నత వ్యక్తి వేమన అన్నారు. ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి మాట్లాడుతూ, కడప జిల్లా లోని ఒక చిన్న గ్రామంలో సాధారణ కుటుంబంలో పుట్టిన వేమన తదుపరి తన జీవితం పై ప్రభావం చూపిన ఘటనల నేపథ్యంలో యోగి వేమన గా మారడం జరిగిందన్నారు. బాహ్య సౌదర్యం కంటే అంతర్ సౌదర్యం తెలుసుకోవడం విజ్ఞులు చేసే పని అని తెలియ చెప్పిన విశ్వద, తరువాత కాలంలో మృత్యువు వరకు వెళ్లి తిరిగి పునర్జన్మ ఇచ్చిన డా. అభిరామ్ లకు గుర్తుగా తన పద్యాలలో చివరన విశ్వదాభిరామ వినురవేమ అని పేర్కొనడం ద్వారా వారు యోగి వేమనపై చూపిన ప్రభావానికి నిదర్శనంగా ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News