-పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నాడు నేడు పనులు
-పేదవర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలుఅందిస్తున్నాం
-రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత, జిల్లా కలెక్టర్ కె. మాధవిలత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత అన్నారు. శుక్రవారం కొవ్వూరు పట్టణంలో పండిత మదన మోహన మాలవ్య పురపాలక ఉన్నత పాఠశాలలో రూ.108 లక్షలతో చేపడుతున్న “మన బడి నాడు నేడు” అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల శంఖుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. మాధవిలత వారితో కలసి మంత్రి పాల్గొన్నా రు.
ఈ సందర్బంగా హోం మంత్రి డా తానేటి వనిత మాట్లాడుతూ, నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున మన బడి నాడు – నేడు పధకం ద్వారా మౌలిక వసతులు కల్పించి ఆధునీకరించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే జగనన్న విద్యా కానుక కింద విద్యార్థు లకు జగనన్న కిట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ని తీర్చిదిద్దే విధంగా మంచి కార్యాచరణతో ముందుకు వెళుతున్నా మన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తుకు పటిష్ట పునాది వేసి, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు గత మూడున్నర సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి బోధనా పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని అన్నారు. విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూ పుతున్నారని దీనిలో భాగంగా అంత ర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా సీబీఎస్ఇ సిలబస్ తో బోధన అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యం గా ఉండా లనేది ప్రభుత్వ లక్ష్య మన్నారు. జగనన్న గోరుముద్ద పధకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఒడి పధకం లో భాగంగా ప్రతీ ఏడా ది విద్యార్థుల తల్లుల ఖాతా ల్లోకి నేరుగా రూ.15 వేలు జమ చేస్తున్నామన్నారు.
జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో మన బడి నాడు నేడు కింద ఎన్నో పనులు చేస్తున్నామన్నారు. వాటిని సరైన విధానంలో నిర్వహణ చేపట్టే బాధ్యత పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులు
స్వీకరించాలి అని కోరారు. గత 3, 4 దశాబ్దాలుగా జూనియర్ కాలేజి ల అభివృద్ధి ఏ ప్రభుత్వం చేపట్టి ఉండ లేదు అన్న విషయం మీకు కూడా తెలుసన్నారు. మన బడి నాడు నేడు కింద జిల్లాలో 598 స్కూల్స్, 19 జూనియర్ కాలేజి లలో నాడు నేడు పనులు చేపట్టినట్లు తెలిపారు. నాడు నేడు కింద చేపట్టిన పనుల పర్యవేక్షణ బాధ్యతలను స్కూల్ పేరెంట్ కమిటీలు తీసుకుని, వారి పిల్లలకు మంచి వాతావరణంలో బోధన అందించే ప్రయత్నం భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ బావన రత్న కుమా రి, మాజీ ఎమ్మెల్సీ కె. శివరామ కృష్ణ, జిల్లా విద్యా శాఖాధికారి ఎస్. అబ్రహం, జడ్పీ వైస్ చైర్ పర్సన్, పోసిన శ్రీలేఖ, ఏఎంసీ చైర్మన్ వల్లభ శెట్టి శ్రీనివాస్, కొ వ్వూరు ఇంచార్జి ఆర్డీఓ, కె. గీ తాంజలి, మునిసిపల్ వైస్ ఛై ర్పర్సన్, గండ్రోతు అంజలీ దేవీ, మునిసిపల్ కమీషనర్, బి. శ్రీ కాంత్, మండల తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, అధికారు లు, నియోజకవర్గ నాయకు లు సచివాలయ సి బ్బంది వాలం టీ ర్లు పాఠశాల ప్రధానో పా ధ్యయులు, వి. గంగా భవాని ఉపాధ్యాయులు, పలువురు అధికారులు, కౌన్సిలర్లు, తదిత రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News