Breaking News

రాష్ట్రం లోఅర్హులైన పింఛను లబ్ధిదారులకు ప్రతినెలా ఒకటోవ తేదిన వాలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే పంపిణీ చేస్తున్నాం.

-గ్రామ వార్డు సచివాలయలు ద్వారా ప్రతి రోజూ సగటున 90 పౌర సేవలు అందిస్తున్నాం
-రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో అర్హులైన పింఛను లబ్ధిదారులకు ప్రతినెలా ఒకటోవ తేదిన వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వచ్చి వైయస్ఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం 19 వ వార్డు లో “గడప గడపకి మన ప్రభుత్వం” కా ర్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. మాధవి లత వారితో కలసి మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో కూడా దేశంలో ఎక్కడ జరగని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపకుండా అందించిన ఘనత వై.యస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. నాయకులు, అధికారులు, సచివాలయాల ఉద్యోగులు వాలంటరీ లతో కలిసి ఇంటింటికి వెళ్లి గత మూడున్నర ఏళ్లలో సంక్షేమ పథకాల వలన కలిగిన లబ్దిని వివరించి, ప్రజలు సమస్యలు తెలుసుకుని అక్కడకక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నా మన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించి కష్ట కాలంలో వారిని ఆదుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కరిం చడానికి ప్రత్యేక దృష్టి సారిచా మన్నారు. రాష్ట్రం లో మహిళల సంక్షే మానికి పెద్ద పీట వేస్తూ, జగ నన్న ప్రభుత్వం నామినేటడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని మంత్రి అన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలని, అర్హులకు అన్ని సంక్షేమ పథకాలను అందచెయ్యలని వనిత స్పష్టం చేశారు. మంత్రి ఇంటింటికి వెళ్లి మూడున్నర సంవత్సరాలగా రాష్ట్ర ప్రభుత్వం అంద చేసిన సంక్షేమ పధకాలు ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ కె.. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందచేస్తున్న సంక్షేమ పథకాల అమలులో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు క్షేత్ర స్థాయి లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ తిరిగి వెళ్లి నేరుగా వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతోందన్నారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా 984 పనులకు సిఫార్సు చేయగా, వాటిలో సుమారు 950 పనులకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందన్నారు. వాటిలో 870 పనులు చేయడం ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. మీకు ఏ సమస్య వచ్చినా, మీ వాలంటీర్ ద్వారా సచివాలయ సిబ్బందికి తెలియ చేసి తక్షణ సహాయం పొందాలన్నారు. మరింత మెరుగైన పౌర సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవడం జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ బావన రత్న కుమా రి, మాజీ ఎమ్మెల్సీ కె. శివరామ కృష్ణ, జడ్పీ వైస్ చైర్ పర్సన్, పోసిన శ్రీలేఖ,  ఏఎంసీ చైర్మన్ వల్లభ శెట్టి శ్రీనివాస్, కొ వ్వూరు ఇంచార్జి ఆర్డీఓ, కె. గీ తాంజలి, మునిసిపల్ వైస్ ఛై ర్పర్సన్, గండ్రోతు అంజలీ దేవీ, మునిసిపల్ కమీషనర్ బి. శ్రీ కాంత్, మండల తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, అధికారులు, నియోజకవర్గ నాయకు లు  సచివాలయ సిబ్బంది వాలంటీ ర్లు  పాఠశాల ప్రధానోపా ధ్యయులు వి. గంగా భవాని,  ఉపాధ్యాయులు, పలువురు అధికారులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *