Breaking News

జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఎపి వైద్య ఆరోగ్య శాఖ

-రాష్ట్రీయ కిషోర స్వాస్థ్య కార్యక్రమంలో రెండు జాతీయ అవార్డుల్ని కైవసం చేసుకున్న ఎపి వైద్య ఆరోగ్య శాఖ
-అవార్డుల్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబుకు చూపించిన అధికారులు
-అభినందించిన కృష్ణ బాబు
-మరింత స్ఫూర్తితో పనిచేయాలని సూచించిన కృష్ణ బాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రీయ కిషోర స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించిన రెండవ జాతీయ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖకు రెండు జాతీయ అవార్డులు లభించాయి. రక్తహీనత నివారణకు సంబంధించిన డబ్ల్యుఐఎఫ్ఎస్ ప్రోగ్రాం, మరియు స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలు సమర్ధవంతంగా నిర్వహించినందుకు ఈ అవార్డులు దక్కాయి. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ తరపున డాక్టర్ నిర్మలా గ్లోరీ, (రాష్ట్రీయ కిషోర స్వాస్థ్య కార్యక్రమం రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్), డాక్టర్ కిరణ్ నాయక్ (స్టేట్ కన్సల్టంట్) అందుకున్నారు. రక్త హీనత నివారణకు ప్రతి గురువారం ఒక నీలి రంగు ఐరన్ మాత్రను పాఠశాలల్లో 10 నుండి 15 సంవత్సరముల బాల బాలికలకు ఇస్తున్నారు. 44,12,717 మంది బాలబాలికలకు ఆశా కార్యకర్తలు, ఎఎన్ఎంల ద్వారా ఈ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. స్కూల్ హెల్త్ వెల్ నెస్ ప్రోగ్రామ్ ను ఆరోగ్యశాఖ, విద్యా శాఖ సంయుక్తంగా 2020 నుండి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల (హైస్కూల్) నుండి ఇద్దరు ఉపాధ్యాయులను గుర్తించి వారికి 11 కౌమారుల అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రతి వారం ఒక అంశంపై విద్యార్ధులకు అవగాహన కల్పించటంతో పాటు అపోహలను నివృత్తి చేస్తారు. మంగళగిరిలోని ఎపిఐఐసి బిల్డింగ్లో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు ఈ అవార్డులను అందుకున్న అధికారులను శుక్రవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె నివాస్, ఎన్ హెచ్ఎం సిఎఓ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *