ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానము నందు శ్రీ శుభకృత్ నామ సంవత్సరము మాఘమాసము పురస్కరించుకొని ది.22 – 01 -2023 నుండి ది 20-02-2023 వరకు మాఘ మాసములో వచ్చు ఆదివారములు, రధ సప్తమి, ఏకాదశిలు, పూర్ణిమ దినముల యందు మొత్తం 8 రోజులలో లోకకళ్యాణార్ధము శ్రీ అమ్మవారి దేవస్థానము నందు సుర్యోపాసనలు జరుగుటలో భాగముగా ఆదివారం రోజున ఆలయ అర్చకులు సూర్యోపాసన సేవ లో భాగముగా అరుణ పారాయణసౌరము, సూర్య నమస్కారములు, సూర్యుని జపములు నిర్వహించారు. ఈ సేవ యందు ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.
తదుపరి, మాఘ మాసములో ఈ క్రింది తెలిపిన తేదిలలో దేవస్థానము నందు సుర్యోపాసన సేవ జరుగును.
సం. తేది వారం తిధి
1. 28 -01 -2023- శనివారం – రధసప్తమి,
2. 29-01-2023 ఆదివారం – శుద్ధ అష్టమి
3. 01 -02-2023 బుధవారం – భీష్మ ఏకాదశి,
4. 05-02-2023 ఆదివారం- మాఘు పూర్ణిమ,
5. 12 -02-2023 – మాఘ ఆదివారం – బహుళ సప్తమి,
6. 16 -02-2023 – గురువారం – బహుళ ఏకాదశి,
7. 19-02-2023 – ఆదివారం – బహుళ చతుర్థశి
సూర్యోపాసన మరియు ఇతర సేవలలో పాల్గొనదలచిన భక్తులు దేవస్థానము యొక్క వెబ్సైటు www.kanakadurgamma.org నందు గానీ, దేవస్థానము మహామండపము 7 వ అంతస్తు నందు ఆర్జిత సేవ కౌంటరు నందు కానీ టికెట్లు పొందగలరు.
Prajavartha Online Telugu News