Breaking News

ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ పొడిగింపుపై హర్షం…

-దళిత గిరిజన బడ్జెట్ వాచ్ 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ, ఎస్టీలకు ఆర్ధిక న్యాయాన్ని సాధించేందుకు ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి కాల పరిమితి మరో 10 సంవత్సరాల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.వో నెంబరు 7 ను విడుదల చేయడం పట్ల దళిత గిరిజన బడ్జెట్ వాచ్ రాష్ట్ర కన్వీనర్ దేవకుమార్ హర్షం వ్యక్తం చేశారు. దళిత గిరిజన బడ్జెట్ వాచ్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్  ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిగా సబ్ ప్లాన్ కు చట్టబద్ధతను సాధించుకున్న దళిత గిరిజన సంఘాల సమైక్య ఉద్యమం మరోసారి కాల పరిమితి పొడిగింపు కొరకు గత 6 నెలలుగా చేసిన ఉద్యమ ఫలితంగానే ప్రభుత్వం జి.వొ. విడుదల చేసిందని ఆయన అన్నారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన నిధుల కేటాయింపు, ఖర్చులు వాటి ద్వారా దళిత గిరిజనులలో వచ్చిన గుణాత్మక మార్పుపై ప్రభుత్వం రాబోవు అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు. చట్టం లోని ఛాప్టర్ 5 సెక్షన్ 19 (8) ప్రకారం సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై సామాజిక తనిఖీని నిర్వహించాలని ఉన్నా గత 9 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా తనిఖీని నిర్వహించక పోవడం విచారకరమని అన్నారు. సబ్ ప్లాన్ నిధులలో కనీసం 50 శాతం దళిత గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి పథకాలకు ఖర్చు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూ చించారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఖర్చు కాకుండా మిగిలి పోయిన నిధులను మరుసటి సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ కు అదనంగా కలిపి ఖర్చుచేయాలని, చట్టంలోని సెక్షన్ 22 (1) ప్రకారం సబ్ ప్లాన్ బడ్జెట్ పర్యవేక్షణకు జిల్లాస్థాయి. పర్యవేక్షణ కమిటీలు సక్రమముగా తమ విధులు, బాధ్యతలు నిర్వహించే విధంగా పర్యవేక్షించాలని అన్నారు. కార్యక్రమంలో జామి రమాదేవి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *