Breaking News

పారిశుధ్య నిర్వహణ మరియు స్థానిక సమస్యలపై అధికారులకు ఆదేశాలు

-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి సర్కిల్-3 పరిధిలో గల 3 వ డివిజన్ నందు లూర్దునగర్ మరియు రామచంద్ర నగర్ తదితర ప్రాంతాలలో తెల్లవారుజామున పర్యటించి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానికంగా ఉన్న సమస్యలను పర్యవేక్షంచి అధికారులు పలు సూచనలు చేసారు. ముందుగా లూర్దునగర్ మరియు రామచంద్ర నగర్ నందలి డ్రెయిన్ల యందు డి సిల్టింగ్ పనులు నిర్వహించాలని అన్నారు. ఆయా ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలిస్తూ, మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని మరియు డ్రెయిన్ల యందు వ్యర్దములు ఎగువకు వెళ్ళకుండా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా గుణదల కొండ పైకి ఎక్కి ప్రతి రోజు చెత్త సేకరణకు మరియు డ్రెయిన్స్ ను శుభ్రపరచుటకు సిబ్బంది వస్తున్నదీ లేనిదీ అడిగితెలుసుకొని ఎవరునూ చెత్తను వీధులలో లేదా డ్రెయిన్ లలో పడవేయకుండా చెత్త సేకరణకు వచ్చు పారిశుధ్య సిబ్బందికు మాత్రమే అందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదే విధంగా డివిజన్ లలో ఇంటింటి చెత్త సేకరణ విధానమును మరియు డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల తీరును పరిశీలించి అధికారులను పలు సూచనలు చేసారు. తదుపరి జాతీయ రహదారి వెంట చేపడుతున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కారిడార్ పనులను ప్రస్తుతం రామవరప్పాడు రింగు నుండి ప్రసాదంపాడు వరకు జరుగుతున్న పనులను పరిశీలించి వాటి నాణ్యత ప్రమాణాలు పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చియున్నారు. కారిడార్ పనులను వాటి యొక్క వివరాలను మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగితెలుసుకొని పలు సూచనలు చేసినారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి, మరియు ఇతర అధికారులు శానిటరీ సెక్రటరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *