-రీ సర్వే పురోగతి భవిష్యత్తు కార్యాచరణ పై సమీక్ష..
-సమావేశానికి హాజరైన సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమీషర్, నాలుగు జిల్లాల కలెక్టర్లు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రీ సర్వే పనులను నిర్దిష్టమైన కాల పరిమితి తో చట్టబద్దత కు అనుగుణంగా పూర్తి చెయ్యాలని వై ఎస్ ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకం పై స్టీరింగ్ మరియు అమలు కమిటీ చైర్మన్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం అన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో తూర్పు గోదావరీ, కాకినాడ, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లా కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లు, సర్వే, రెవెన్యూ, సచివాలయ అధికారులతో స్పెషల్ సి ఎస్ పి. సాయి ప్రసాద్, సిసిఎల్ఏ కమిషనర్ సిద్దార్థ జైన్ లతో కలిసి అజయ్ కల్లాం ” వై ఎస్ ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకం” అమలు తీరుపై రీ సర్వే పై ప్రాంతీయ సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ కల్లాం మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి భూముల సమగ్ర రీసర్వే ప్రక్రియలో పూర్తి పారదర్శకత జవాబుదారితనం ఉండాలన్నదే సంకల్పం అన్నారు. భూముల రీ సర్వే ప్రక్రియలో నిర్థిష్ట కాలపరిమితిలో ఫేజ్డ్ విదానంలో 2 వేల గ్రామాలు చొప్పున రీ సర్వే పనులను చేపట్టి పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2 వేల గ్రామాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటికి సంబందించి జగనన్న భూహక్కు పత్రాలను ఫిబ్రవరి నెలాఖరు నాటికి పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఫేజ్ -2 విధానంలో మరో 2 వేల గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందన్నారు. చట్టబద్దత కలిగి రీ సర్వే చేపడుతున్నామని, ఇందులో భాగంగా ప్రజల నుంచి వచ్చే అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాల్సి ఉందన్నారు. జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిష్కారం సమయంలో రికార్డులు పరిశీలన కాకుండా వాస్తవ భూ యజమానులతో వాస్తవ స్థితిని నిర్థారణ చేసుకోవాలన్నారు. ఇందుకోసం తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని ఆదేశించారు.
వాస్తవ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యలపై చర్చించి తగిన సూచనలు చేయడానికి వేదికగా ఈ సమీక్షా సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అజయ్ కలాం స్పష్టం చేశారు. జిల్లాల స్థాయి సమీక్షల అనంతరం ఆయా జిల్లా అధికారులతో అంశాల వారీ సమీక్షిస్తూ అనంతరం స్పందిస్తూ వారి ఇచ్చిన సూచనలను సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ కమీషనర్ లతో మరో దఫా విస్త్రుతంగా సమీక్షించి వాటికి పరిష్కారం చూపుతామన్నారు. 2023 డిశంబరు నాటికి రీసర్వే పనులను పూర్తి చేసి భూయజమానులకు భరోసా కల్పించేలా భూహక్కు పత్రాలను అందజేయడంలో సమన్వయంతో పనిచేయాలన్నారు. తదుపరి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వే పనులు సమర్థవంతంగా చేపడుతూ జగనన్న భూ హక్కు పత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూ సర్వే లో రైతులు, భూ యజమానులు భూ హద్దులు కొలతల పై చిన్నచిన్న అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని వాటిని కూడా పరిష్కరించే దిశలో వాస్తవాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వే ద్వారా భవిష్యత్తులో సిలిల్ తగాదాలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం లేదని ఆయన తెలిపారు.
సీసీఎల్ఏ ప్రత్యేక ప్రథాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మాట్లాడుతూ రీసర్వే చేపట్టే విదానంలో సమగ్రంగా రికార్డులను తనిఖీ చేసి ఆమేరకు నిర్ణయం తీసుకోవలన్నారు. ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీల సందర్భంలో పర్యవేక్షణా భాద్యతలను నిబద్దతతో పాటించాలని స్పష్టం చేశారు. పర్యవేక్షణ చేసే సమయంలో ఎటువంటి అలసత్వం చూపవద్దని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు చేసిన పనితీరుపై వివరాలు తెలుపుతూ త్వరలోనే పూర్తి చేస్తామనే హామీ ఇస్తుంటారన్నారు. అయితే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భూ హక్కు పట్టాల పంపిణీ రీ సర్వే పనులకు చెందిన ప్రతి ఒక్క వివరాన్ని క్షేత్రస్థాయి వివరాలు భూ రికార్డులు యజమానుల పరంగా సమగ్రంగా వివరాలు తెలుసుకొని అక్కడక్కడే తప్పలు సరిదిద్దాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్ట్రాత్మకంగాచేపడుతున్న వైఎస్ఆర్.జగనన్న భూహక్కు మరియు భూరక్ష పథకం అమలులో పకడ్బంది కార్యాచరణ అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
సీసీఎల్ ఏ కమీషనర్ సిద్దార్థ జైన్ మాట్లాడుతూ మరింత త్వరిత గతిన రీ సర్వే పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులకు వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నామన్నారు. వారు చేసే సూచనలకు అనుగుణంగా ఇప్పటికే పలు మార్లు సాంకేతిక పరమైన అంశాలతో కూడిన చర్యలను తీసుకోవడం జరిగిందని వాటికి సంబందించి “ ప్యాచ్ “ లను కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పడు సమన్వయం చేసుకొనే దిశలో టెలికాన్పరెన్స్ పరికరాలను సర్వేర్వే శాఖ ద్వారా అందజేయడం జరిగిందన్నారు. రీ సర్వే అనేది సహజంగా జరిగే ప్రక్రియ అని ఈ సారి చేపడుతున్న సర్వే చట్టబద్దతతో పాటు సాంకేతికతను కలిగి ఉందన్నారు. ప్రతి ఒక్క అధికారి నిబద్దతతో సమర్థవంతంగా రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించే సమయంలో మ్యూటేషన్ కు సంబందించి ఒక దరఖాస్తు ఆమోదించిన లేదా తిరష్కరించిన అందుకు గల కారణాలను అక్కడికక్కడే సమీక్షించాలని అప్పుడే క్షేత్ర స్థాయి సిబ్బందికి రీ సర్వే పట్ల జవాబు దారీ కలిగి ఉంటారన్నారు.
జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత తొలుత రీసర్వే ప్రాంతీయ సమీక్షా సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులను, ఇతర జిల్లా కలెక్టరులకు, జాయింట్ కలెక్టర్లకు, ఇతర అధికారులకు ఆహ్వానం పలికారు.
అనంతరం సమీక్షలో భాగంగా తూర్పుగొదావరి జిల్లాకలెక్టరు డా.కె. మాధవీలత, జాయింట్ కలెక్టరు ఎన్.తేజ్ భరత్ లు జిల్లాలో అమలు జరుగుతున్న రీసర్వే పై వివరాలు అందజేశారు. జిల్లాలో 272 గ్రామ పంచాయితీల పరిధిలో 605332 ఎకరాల విస్తీర్ణం ఉందని, పేజ్ -1 లో 44 గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తి చేసామన్నారు. ఇందులో భాగంగా 19865 జెబిహెచ్ పట్టాలకు గాను 18690 పంపిణీ చేశామన్నారు. మ్యూటేషన్ కు సంబందించి 2768 అర్జీలకు గాను 2300 పరిష్కరించామన్నారు. తప్పుగా నమోదైన ఖాతాకు సంబందించి 1967 వచ్చాయని వాటిని నూరు శాతం పరిష్కరించామన్నారు. పాత సర్వే నెంబర్లలో తప్పులను సరిదిద్దే ప్రక్రియలో వచ్చిన 654 వచ్చాయని వాటిని పరిష్కరించామన్నారు. భూమి కొలతలలో అసమతుల్యత(మిస్ మ్యాచ్) సంబందించి వచ్చిన 206 అర్జీలను పరిష్కరించామన్నారు.
కాకినాడ జిల్లాకలెక్టరు డా.కృతికా శుక్లా, జాయింట్ కలెక్టరు ఇలాక్కియా లు కాకినాడ జిల్లాలో అమలు జరుగుతున్న రీసర్వే పై వివరాలు తెలుపుతూ జిల్లాలో 413 గ్రామ పంచాయితీల పరిధిలో పేజ్ -1 లో 207 గ్రామాలకు గాను 128 గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తి చేసామన్నారు. ఇందులో భాగంగా 49658 జెబిహెచ్ పట్టాలకు గాను 46223 పంపిణీ చేశామన్నారు. మ్యూటేషన్ కు సంబందించి 110 అర్జీలు పరిష్కరించామన్నారు. రీ సర్వే తదుపరి క్లరికల్ తప్పిదాలకు సంబందించి 120 పాత సర్వే నెంబర్లలో తప్పులను సరిదిద్దే ప్రక్రియలో వచ్చిన 120 వచ్చాయని వాటిని పరిష్కరించామన్నారు. భూమి కొలతలలో అసమతుల్యత(మిస్ మ్యాచ్) సంబందించి వచ్చిన 120 అర్జీలను పరిష్కరించామన్నారు.
డా. బిఆర్ అంబేద్కర కోనసీమ జిల్లాకలెక్టరు హిమాన్స్ శుక్లా, జాయింట్ కలెక్టరు హెచ్ ఎం, జ్ఞాన్ చంద్ లు కోనసీమ జిల్లాలో అమలు జరుగుతున్న రీసర్వే పై వివరాలు తెలుపుతూ జిల్లాలో 7 మండలాల పరిదిలోని 52 గ్రామాలు, 121 హాబిటేషన్స్ కు చెందిన గ్రౌండ్ ట్రూతిగ్ పనులు పూర్తి చేశామన్నారు. మ్యూటేషన్ కు సంబందించి 62 అర్జీలు పరిష్కరించామన్నారు. రీ సర్వే తదుపరి క్లరికల్ తప్పిదాలకు సంబందించి 65, పాత సర్వే నెంబర్లలో తప్పులను సరిదిద్దే ప్రక్రియలో వచ్చిన 66, భూమి కొలతలలో అసమతుల్యత(మిస్ మ్యాచ్) సంబందించి వచ్చిన 66 అర్జీలను పరిష్కరించామన్నారు.
ఏలూరు జిల్లాకలెక్టరు వి. ప్రసన్న వెంకటేష్ ఏలూరు జిల్లాలో అమలు జరుగుతున్న రీసర్వే పై వివరాలు తెలుపుతూ జిల్లాలో 689 గ్రామ పంచాయితీల పరిధిలో పేజ్ -1 లో 80 గ్రామాలలో రీ సర్వే పనులు పూర్తి చేసామన్నారు. ఇందులో భాగంగా 24506 జెబిహెచ్ పట్టాలకు గాను 20385 పంపిణీ చేశామన్నారు. మ్యూటేషన్ కు సంబందించి 2836 అర్జీలు పరిష్కరించామన్నారు. రీ సర్వే తదుపరి క్లరికల్ తప్పిదాలకు సంబందించి 526, పాత సర్వే నెంబర్లలో తప్పులను సరిదిద్దే ప్రక్రియలో వచ్చిన 161 వచ్చాయని వాటిని పరిష్కరించామన్నారు. భూమి కొలతలలో అసమతుల్యత(మిస్ మ్యాచ్) సంబందించి వచ్చిన 323 అర్జీలను పరిష్కరించామన్నారు. సమావేశంలో నాలుగు జిల్లాల రెవెవిన్యూ సర్వే శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News