విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 31, ఫిబ్రవరి 1,2 తేదీలలో కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ షా బుఖారి బాబా (ర.అ) వారి 426వ ఉరుసు మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉరుసు మహోత్సవ ఆహ్వన పత్రాన్ని షా బుఖారి బాబా నిత్యాన్నదాన నిర్వాహకులు, సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అంజాద్ భాషా కు అందజేశారు. విజయవాడలోని ఆయన నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఆహ్వాన పత్రం అందజేశారు అల్తాఫ్ బాబా.ఈ కార్యక్రమంలో ఆయన వెంట షాబుఖారి బాబా భక్త బృందం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News