Breaking News

ఈ నెల 25 న జాతీయ ఓటర్ల దినోత్సవం: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 25 న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ల అవగాహనా ర్యాలీ, సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 న బుధవారం ఉదయం 10 గంటల నుండి కొత్త మునిసిపల్ కార్పోరేషన్ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభమై, టౌన్ క్లబ్ కూడలిలో మానవహారం ఏర్పాటు, స్థానిక ఎస్.వి. యూనివర్సిటీ ఆడిటోరియంలో ఓటర్ల అవగాహనా సదస్సు నిర్వహించి ఓటర్ల నమోదు, పరిశీలనలో ప్రతిభ కనబరచి ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి బెస్ట్ ఎలెక్టరోరల్ ప్రాక్టీసెస్ అవార్డులను ఇ.ఆర్.ఓ. లకు, ఎ.ఈ.ఆర్.ఓ.లకు అందించనున్నట్లు తెలిపారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ – 2023 లో ప్రతిభ కనబరచిన ( 6 బి ఫారం, ఆధార్ సేకరణలో అత్యంత సమన్వయo కనబరచిన) బూత్ లెవెల్ ఆఫీసర్ (వి.ఆర్.ఓ), ఎం.ఆర్.పల్లి పోలింగ్ స్టేషన్ – 244  కె.జె.నీలుఫర్ కు రాష్ట్ర స్థాయి ఎన్.వి.డి. – 2023 అవార్డును విజయవాడలో అందుకోనున్నారని కలెక్టర్ వివరించారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని నేడు జిల్లా కలెక్టరేట్ లో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *