Breaking News

SRR & CVR కళాశాలను మోడల్ కాలేజీగా తీర్చిదిద్దుతాం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 2.32 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణ పనులకు భూమిపూజ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వ విద్యాలయాలు పున:వైభవం సంతరించుకుంటున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మాచవరంలోని SRR & CVR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 2.32 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణ పనులకు మంగళవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. & సి.వి.ఆర్ కళాశాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని.. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులెందరో ఉన్నత స్థానాలను అధిరోహించారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి కళాశాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు, ఫర్నీచర్.. ఇలా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కళాశాలకు ప్రహరీ గోడను నిర్మించి పరిరక్షించడం జరిగిందన్నారు. మరలా ఇప్పుడు రూ. 2.32 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. గత ప్రభుత్వంలో విద్యాలయాలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితులలో ఉండేవని.. కానీ నేడు సకల వసతులతో కళకళలాడుతున్నాయన్నారు. మూడున్నరేళ్ల కాలంలో విద్యారంగానికి రూ. 53 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమేనని కితాబిచ్చారు. నూతన విద్యా విధానం అమలులో దేశంలోనే ఏపీ ముందుందని చెప్పుకొచ్చారు. విద్యా రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా నిలిచాయని మల్లాది విష్ణు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను అక్షరాస్యతలో అగ్రస్థానాన నిలపడమే లక్ష్యంగా కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ కు ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పనులను శరవేగంగా చేపట్టాలని అధికారులకు మల్లాది విష్ణు సూచించారు. కార్యక్రమంలో EE(APEWIDC) బి.అనిల్ కుమార్, డీఈ రాయన్న, APEWIDC డైరక్టర్ మాధవీలత, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, NIRF కోఆర్డినేటర్ రాంబాబు, స్థానిక కార్పొరేటర్ వి.రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, డివిజన్ కోఆర్డినేటర్ కోలా నాగాంజనేయులు, అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *