విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖాధీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేది నుండి ఫిబ్రవరి 6వ తేది వరకు నగరంలోని పంటకాలువ రోడ్డు మేరీ స్టేల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించడ జరుగుతుందని జిల్లా హాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సహాయ సంచాలకులు ఎస్ రఘనంద ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎగ్జిబిషన్‌లో మన రాష్ట్రంతో పాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, జార్ఖాండ్, కేరళ, డిల్లీతో పాటు 10 రాష్ట్రాలకు చెందిన ఖాధీ విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తుల అమ్మకాలను నిర్వహించనున్నామన్నారు. 120కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈనెల 28 తేది సాయంత్రం 5 గంటలకు ప్రదర్శనను జిల్లాకు చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ప్రారంభిచనున్నారని సహాయ సంచాలకులు రఘనంద ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News