Breaking News

ముఖ ఆధారిత హాజరులో ఇబ్బందులు తొలగించాలి.. జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ ఆధారిత హాజరులో ఉద్యోగులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ముఖ ఆధారిత వ్యవస్థలోనే అనేక సాంకేతిక లోపాల వలన దయనందన కార్యక్రమాన్ని ముందుకు సాగించలేని పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ ఇబ్బందులన్నీ తొలగించాలని జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ కోరారు. ముఖ ఆధారిత హాజరుపై విజయవాడ నగరంలోని వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగులుతో విజయవాడ నగర శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన విద్యాసాగర్ మాట్లాడుతూ ముఖ ఆధారిత హాజరు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిందని దీనిని అమలు చేసే క్రమంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
డిపార్ట్మెంట్లోని ఫీల్డ్ స్టాప్ కి డి వో ఆఫీస్ కి వచ్చి ముక్క హాజరు వేయటం కష్టతరంగా మారిందని ఫీల్డ్ వర్క్ చేసే పరిస్థితి లేదని, ఫీల్డ్ లో ఉన్న స్టాపు సిగ్నల్ ప్రాబ్లం వలన హాజరు నమోదు చేయలేకపోతున్నారని, అలాగే సెలవులకు సంబంధించిన ఆప్షన్స్ కూడా ముఖ ఆధారిత యాప్ లో ఇంతవరకు పొందుపరచలేదని, ఏదైనా రోజున అత్యవసరంగా ఆరోజు సెలవు పెట్టుకోవాలంటే సెలవు పెట్టుకునే సదుపాయం కూడా ఫేస్ షాప్ లో లేదని తెలిపారు. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులు మాట్లాడుతూ ఉద్యోగులు ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులు ఆండ్రాయిడ్ ఫోన్ లేనివారు అనేక ఇబ్బందులు పడుతున్నారని హాజరు వేళలో సపరేట్ గా ఉన్న వాచ్మెన్ లాంటి ఉద్యోగులకు ఎటువంటి ఏర్పాటు కల్పించలేదని తెలిపారు.

హెడ్ కోటర్స్ లో డ్రాయింగ్ ఆఫీసర్ ఉండి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డ్రాయింగ్ ఆఫీసర్ ఆఫీస్ కాకుండా వారు చేస్తున్న ప్రాంతంలో ముఖహాసరును ఇవ్వటం తప్పనిసరి అని దాని ఏర్పాటు చేయించవలసిందిగా ఉద్యోగులు శ్రీ ఏ విద్యాసాగర్ దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు, పెండింగ్ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకుండా మీనవేషాలు లెక్కిస్తుందని, ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సన్మానం ఉందని దీనిపై నాయకత్వం స్పందించి వెంటనే డిమాండ్ల పరిష్కారం దిశగా కార్యాచరణ చేయాలని కోరారు.

ఉద్యోగులకు సంబంధించి సంవత్సరం కాలంగా పెండింగ్లో ఉన్న జిపిఎఫ్ బిల్లులు ఏపీజిఎల్ఐ బిల్లులు అలాగే సరెండర్ లీవు బిల్లులు ఎంతవరకు మంజూరు చేయలేదని దీనితో మిక్కిలి ఇబ్బందులు పడుతున్నామని ఒక్క ముక్క హాజరుతో ఒకపక్క పెండింగ్ బిల్లులతో ఉద్యోగుల పరిస్థితి చాలా ధైర్యంగా ఉందని పలు ఉద్యోగులు నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర నాయకత్వం మొత్తం కూర్చుని కార్యాచరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల డిమాండ్లను తీర్చనిపక్షంలో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తామని, ఉద్యోగులు ఆందోళన కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు పి రమేష్ కోశాధికారి సతీష్ ఉపాధ్యక్షులు శ్రీ రాజబాబు శ్రీ విశ్వనాథ్, శ్రీ బీవీ రమణ పాల్గొన్నారు. విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు శ్రీ శ్రీ రామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నగర కార్యదర్శి సంపత్ కుమార్ కోశాధికారి నజీర్ సివిఆర్ ప్రసాద్ మరియు వివిధ ఎన్జీవో నాయకులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *