Breaking News

జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీ మానవ హారంలో పాల్గొన్న కలెక్టర్

-ఓటరుగా గర్వపడండి ఓటు వేయడానికి సిద్ధం అవ్వండి
-ఓటు హక్కు వినియోగంతో ప్రజలు మెచ్చిన ప్రభుత్వం ఏర్పడుతుంది: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటుతోనే దేశ భవిష్యత్తు నిర్ణయించ బడుతుంది అని, ప్రజలు మెచ్చిన మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో 13 వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ 18 సం. లు నిండిన ప్రతి పౌరుడు ఓటర్ గా నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత తప్పక ఉందని, దేశ భవిష్యత్తు యువత పై, వారు వినియోగించుకునే ఓటు హక్కు పై ఆధారపడి ఉందని అన్నారు. జిల్లాలో బి ఎల్ ఓ లు, ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లు రెవెన్యూ యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి తప్పులు లేని ఎస్ ఎస్ ఆర్ 2023 మరియు 13500 మంది నూతన ఓటర్ల నమోదు జిల్లాలో చేయగలిగామని అన్నారు. కొత్తగా ఓటరుగా నమోదైన వారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఓటరు ఐడి కార్డులను కొందరికి ఈ సందర్భంగా అందజేసారు. ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించు కోలేదని మిగిలిపోకుండా అందరూ వినియోగించుకునేలా చర్యలు చేపట్టే దిశలో స్వీప్ ప్రోగ్రాం కింద అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. యువత దేశానికి వెన్నెముక అని, వారు ఓటు హక్కు పొంది ఓటు హక్కును వినియోగించుకున్న నాడు సరైన నాయకులను ఎన్నుకుంటారని, దానివలన ప్రజామోదం పొందిన ప్రభుత్వం వస్తుందని తద్వారా భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయ పడ్డారు. కాబట్టి యువత ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాల్సిన అవసరం ఉందనీ, ఎప్పుడైనా ఏ రోజైనా ఓటరుగా అప్లై చేసుకోవచ్చని వెరిఫికేషన్ అనంతరం ఓటరుగా అర్హత ఉన్నట్లయితే వాళ్లందర్నీ కూడా మనం ఓటర్లు గా నమోదు చేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత ఓటరుగా నమోదు కావడంలో, ఓటు హక్కు వినియోగించుకోవడంలో వెనుకబడి ఉన్నారని నిర్లక్ష్య ధోరణి విడనాడాలని తప్పకుండా ప్రతి పౌరుడు 18 సంవత్సరాల నిండిన వారు ఓటు హక్కు పొందాలని దానిని సరైన రీతిలో ఓటు వేసి వినియోగించుకోవాలని అప్పుడే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం దేశం కూడా అభివృద్ధిలో ఉంటుందని అన్నారు. ఓటును అమ్ముకోవడం ద్వారా మనం మన రాష్ట్ర దేశ అభివృద్ధిలో ఐదు సంవత్సరాలు వెనకబడి పోతామని గుర్తు చేశారు ఈ సంవత్సరం జాతీయ ఓటర్ దినోత్సవం నినాదం ఓటింగ్ కు మించినది ఏదీ లేదు… ఓటు హక్కును వినియోగించుకుంటాం అని ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలని కోరారు.

డిఆర్ఓ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రపంచంలో కెల్లా అత్యున్నత రాజ్యాంగం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చే రచించబడినదని అందులో ప్రజాస్వామ్యంకు అత్యంత ప్రాముఖ్యత కలదని, ఆర్టికల్ 324 ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ఏర్పాటు మన దేశంలో ఎంతో గొప్ప వ్యవస్థ అని, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి ఓటింగ్ విధానం ద్వారా ప్రజామోదం పొందినటువంటి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు.

ఆర్డీవో గూడూరు కిరణ్ మాట్లాడుతూ ఓటరు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా నిష్పాక్షికంగా వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం ఎంతో మంచి సదవకాశం కల్పించిందని అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా 90 సంవత్సరాల పైన ఉండి ఎక్కువసార్లు ఓటు హక్కు వినియోగించుకున్న కొందరికి, అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఈ ఆర్ ఓ లు సత్యవేడు శ్రీనివాస రావు, చంద్రగిరి కనక నరస రెడ్డి, సూళ్లూరుపేట గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్, ఏ ఈ ఆర్ ఓ లు చంద్రగిరి శిరీష శ్రీకాళహస్తి షేక్ జరీనా, బి ఎల్ ఓ లకు, ఈ ఆర్ ఓ, ఏ ఈ ఆర్ ఓ లకు బిఎల్ఓ, ప్రిన్సిపల్ ఎస్ డి హెచ్ ఆర్ లకు సన్మానం చేసి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం అందరితో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశానికి ముందు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో ఎన్ టి ఆర్ సర్కిల్ వద్ద మానవ హారం లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, పవన్, ఆర్ ఐ రామచంద్రా రెడ్డి రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *