-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలు చెడు అలవాట్లు కు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అదే సమయంలో వాటికి దూరంగా ఉంచే క్రమంలో చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ద్వారా “పిల్లల కోసం భద్రత మరియు భద్రతా మాన్యువల్”పై శిక్షణ మరియు COTPA చట్టం, జువెనైల్ & జస్టిస్ (పిల్లల సంరక్షణ & రక్షణ) చట్టం, 2015 యొక్క నిబంధనలు పై జిల్లా స్థాయి సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి అధికారులు నివేదిక సిద్దం చెయ్యాలని స్పష్టం చేశారు. మత్తు పదార్థాలు కలిగిన మందులు డాక్టర్ల సిఫార్స్ లేకుండా జరిపే విక్రయాలకు సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ ట్రేడర్స్ అసోసియేషన్‌తో సమావేశం నిర్వహించి, పూర్తి వివరాలు సేకరించాలన్నారు. ప్రతి మెడికల్ షాప్ వద్ద విధిగా సిసిటివి ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఎన్ని మెడికల్ షాపులు ఉన్నాయి, ఎన్ని షాపుల వద్ద సిసి టివి కెమెరాలు ఏర్పాటు చేసిన వివరాలు అందచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు పాఠశాలలకు దూరంగా ఉన్నా, తొలగించిన వాటి వివరాలు అంద చేయాలని ఆదేశించారు. పంచాయతీ/పట్టణ స్థానిక సంస్థ మద్యం విక్రయించే ప్రస్తుత దుకాణాల జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. స్కూల్ చుట్టూ డ్రగ్స్/ పొగాకు చెందిన సిగరెట్లు అమ్మే షాపుల్లో ఉన్నాయి వంటి వివరాలపై సమగ్ర నివేదికను అంద చెయ్యలన్నారు. అటువంటి ఉంటే తక్షణం COTPA (సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం) చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం పాఠశాలలకు దూరంగా మార్చలనన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు, వ్యసనాల బారిన పడకుండా పాఠశాలల్లో తనిఖీ చేయడం ద్వారా నియంత్రణ సాధ్యం చెయ్యగలం అన్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015లోని 77 & 78లో ఎన్ని కేసులు నమోదయ్యాయి వివరాలు అడుగగా, ఒక్క కేసు నమోదు కాలేదని పోలీస్ అధికారులు తెలిపారు. షెడ్యూల్ చేయబడిన H & X ఔషధాలను విక్రయించే షాపుల్లో తప్పకుండా జిల్లా మేజిస్ట్రేట్ u/s 133 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) జారీ చేసిన ఆదేశాలు అమలు చేయాలని అన్నారు. వాటికి సంబంధించిన అమ్మకాలను డిజిటలైజేషన్ జరిగిందా లేదో తనిఖీ చేపట్టాలని సూచించారు. చైల్డ్ వెల్ఫేర్, పోలీస్ ఆఫీసర్, విద్య తదితర శాఖ లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. పిల్లల్లో డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణకు సంబంధించి జిల్లావారీగా న అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చికిత్స, డి-అడిక్షన్ కౌన్సెలింగ్‌పై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆ దిశలో పాఠశాలలకు సెన్సిటైజేషన్ మరియు శిక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టవలసి ఉందన్నారు. మాదకద్రవ్యాలు మరియు మత్తు పదార్థాల దుర్వినియోగం వలనా బాధపడుతున్న పిల్లలకు పునరావాసం నిర్వహించే దిశలో “కేస్ స్టడీస్” చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు . అందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యవొచ్చు అని అన్నారు.
జిల్లాలో ప్రత్యేకమైన డి అడిక్షన్ సౌకర్యాలు ఉన్నాయా, లేకుంటే ప్రస్తుతం ఉన్న సదుపాయంలో పిల్లల కోసం గుర్తించి విభజించబడిన ప్రత్యేక భాగం మరియు కేంద్రంలో నమోదైన కేసుల సంఖ్య పై అధ్యయనం చేయాలని మాధవీలత అన్నారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పొగాకు/మద్యం విక్రయాల నిషేధానికి సంబంధించి తగిన ప్రదేశాల్లో హోర్డింగ్‌లు ఉంచాలని తెలిపారు. డ్రగ్స్ మరియు మత్తు పదార్ధాలను ఉపయోగించే పరిస్థితుల్లో ఉన్న పిల్లలను మ్యాపింగ్ చేయడం ద్వారా వారిని నిరంతర పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలన్నారు.
జిల్లా ఆసుపత్రి లో డి అడ్డిక్షన్ కేంద్రం ఏర్పాటు చెయ్యాలన్నారు. ప్రైవేట్ సంస్థలు ద్వారా నిర్వహించే డి అడ్డిక్షన్ కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందించే వాటిపై కేస్ స్టడీస్ కూడా చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి అలవాట్లకు బానిసలైన వారి విషయంలో జువెనైల్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి వారిలో చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా వాటి వినియోగం తగ్గించడం సాధ్యం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఐ సి డి ఎస్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె. విజయ కుమారి , జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి (కాకినాడ) జీ. జనార్ధన రావు, అదనపు ఎస్పీ సిహెచ్. పాపారావు, డి సి హెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి, డి ఈ ఓ ఎస్. అబ్రహం, డిసిపివో సిహెచ్. వెంకట్రావు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News