Breaking News

లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత జగనన్నదే : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సచివాలయ,వలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ 61,283 సచివలయాల పరిధిలో నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాల లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి కుటుంబానికి లక్షల్లో లబ్ది చేకూరింది అని, గతంలో ఎన్నడూ లేని విధంగా కార్యాలయాల చుట్టూ తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా అర్హతను బట్టి నేరుగా ఇంటి వద్దకే పెన్షన్లు, పధకాలు అందిస్తున్నారని ప్రజలు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నారు. ఈరోజు నుండి యువగళం అంటూ పాదయాత్ర చేపడుతున్న నారా లోకేష్ , టీడీపీ వారు వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు, ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదో చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. నాడు జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టినప్పుడు ప్రజలంతా స్వచ్చంధంగా బయటకు వచ్చి వారి సమస్యలను ఏకరువు పెట్టారని, కానీ నేడు లోకేష్ కు సంక్షేమ పథకాల లబ్ధితో సంతోషంగా ఉన్న ప్రజానీకం ఎదురుగా కన్పిస్తారని అన్నారు. ఈ పాదయాత్ర లో ఇక టీడీపీకి తిరిగి అధికారం రావడం కల్లే అని వారికి అర్థం అవుతుంది అని ఎద్దేవా చేశారు. మీరెన్ని కల్లబొల్లి హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వారి సంపూర్ణ మద్దతు వైసీపీ ప్రభుత్వానికే అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్, వైస్సార్సీపీ నాయకులు ఏసుపాదం, నరసింహారావు, నాగరాజు, రాజేష్, జయరాజు, తదితరులు పాల్గొన్నారు.

తోపుడు బండి అందజేత
తూర్పు నియోజకవర్గ14వ డివిజన్ లో జరుగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు అంబేద్కర్ నగర్ కు చెందిన చింతమల దాసు అద్దె బండితో ఇబ్బంది గా ఉందని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా శుక్రవారం నాడు వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15వేల రూపాయల విలువైన తోపుడు బండిని, అదేవిధంగా నిరుపేద కుటుంబానికి చెందిన విజయబాబు కు కుటుంబ పోషణ నిమిత్తం 15వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *