Breaking News

నాడు-నేడు కార్యక్రమం ప్రశంసనీయం… : అరసవిల్లి అరవింద్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలలతోపాటు వైద్యశాలల బాగోగుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలుచేస్తోన్న నాడు-నేడు పథకం ప్రశంసనీయమని విద్యావేత్త అరసవిల్లి అరవింద్ కొనియాడారు. నాడు నేడు స్ఫూర్తితో అరసవిల్లి అరవింద్ ఛారిటబుల్ ట్రస్ట్ ఇప్పటికే తుళ్లూరు మండలం మందడంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. శిథిలావస్థలో ఉన్న తరగతి భవనాల ఆధునికీకరణకు సంకల్పించామన్నారు. ఇందులో భాగంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలవగా ట్రస్ట్ సేవలను అభినందించారని అరసవిల్లి అరవింద్ తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలంటూ సీఎం ప్రోత్సహించారని చెప్పారు. విజయవాడ కేంద్రంగా ప్రారంభించిన అరసవిల్లి అరవింద్ ట్రస్ట్ నేతృత్వంలో ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అనాథలకు ఉచిత వైద్య శిబిరాలు, భోజన వసతులు కల్పిస్తున్నామని త్వరలో మహిళా సాధికారత దిశగా కార్యక్రమాలు చేపట్టనున్నామని అరసవిల్లి అరవింద్ వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *