Breaking News

ఫిష్‌ రిటైల్‌ అవులెట్ల ద్వారా మత్స్య సంపదకు మార్కెట్‌ సౌకర్యం…

-మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఫిష్‌ రిటైల్‌ అవులెట్లను ఏర్పాటు చేసి మత్స్య సంపదకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి వినియోగదారులకు తాజా ఉత్పత్తులను అందించడంతో పాటు మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఫిష్‌ ఆంధ్ర మొబైల్‌ వాహనాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు తెలిపారు.
మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్య కారులు, మత్స్య కార సంఘాలు, మత్స్య సంపదను విక్రయించేందుకు మంజూరు చేసిన మొబైల్‌ వాహనాలను సోమవారం కలెక్టరేట్‌ ఆవరణంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్య కారుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా మత్స్య కారులు బహిరంగ మార్కెట్‌లో మొబైల్‌ వాహనాల ద్వారా తాజా మత్స్య సంపదను వినియోగదారులకు నేరుగా విక్రయించుకుని ఆర్థిక పరిపుష్టిని సాధించాలని లక్ష్యంతో సబ్బిడీపై మొబైల్‌ వాహనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కృష్ణానది, సముద్రంలో వేటాడిన మత్స్య సంపదతో పాటు చెరువుల ద్వారా ఉత్పత్తి చేసిన మత్స్య సంపదను విక్రయించుకోవడంతో పాటు చేపలు, రొయ్యలు, పీతలు వంటి జల సంపదతో తయారు అయిన రెడీ టూ ఈట్‌ ఉత్పత్తులను మొబైల్‌ వాహనాల ద్వారా రిటైల్‌ గా విక్రయించుకునే అవకాశం మత్స్యకారులకు మత్స్యకార సంఘాలకు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఫిష్‌ రిటైల్‌ అవులెట్లు, ఫిష్‌ రిటైల్‌ మార్కెటింగ్‌ హబ్‌లు, ఫిష్‌ కియోష్కా, ఐస్‌బాక్సులతో కూడిన టూవీలర్‌ త్రీ వీలర్‌ మోటర్‌ సైకిళ్ళ పంపిణీ, లైవ్‌ఫిష్‌ అమ్మక కేంద్రాల ఏర్పాటు వంటి పథకాలకు సబ్బిడీ పై ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఆయా పథకాలకు లబ్దిదారుల నుండి స్వీకరించిన ధరఖాస్తులలో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి వాహనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. షిష్‌ ఆంధ్ర పథకం కింద ఒక్కొక్కటి 4.62 లక్షల రూపాయల వ్యయంతో మూడు త్రిచక్ర వాహనాలను, ఒక్కొక్కటి 13.29 లక్షల రూపాయల వ్యయంతో నాలుగు మిని కంటైనింగ్‌ లారీలను లబ్దిదారులకు అందజేస్తున్నామన్నారు. మత్స్య కారులు వినియోగారులను ఆకట్టుకునేలా తాజా మత్స్య సంపదను విక్రయించి మన్నలను పొందడం ద్వారా మరిన్ని మొబైల్‌ విక్రయ వాహనాలను మంజూరు చేసేందుకు అవకాశం వుంటుందన్నారు. జిల్లాలోని పట్టాణాలలో రద్దీగా వుండే ప్రాంతాలు పార్కులు, మార్కెట్‌ ప్రదేశాలలో మత్స్యకారుల ఆధ్వర్యంలో ద్వారా మొబైల్‌ అవులెట్లు ఏర్పాటు చేసి రెడీ టూ ఈట్‌ తాజా ఆహార పదర్థాలను విక్రయించేందుకు మొబైల్‌ అవులెట్లను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, డిప్యూటి మేయర్‌ అవుతు శైలజారెడ్డి, జిల్లా మత్స్య శాఖ డిప్యూటి డైరెక్టర్‌ ఏ నాగరాజా, ఎఫ్‌డివోలు పి అఖిల, కె. నాగబద్రరావు, మత్స్యకారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *