రాయవరం ( గూడూరు ), నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా, ఉన్నతమైన చదువులు చదివించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వహిస్తారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ భరోసా ఇచ్చారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గూడూరు మండల పరిధిలో 15 క్లస్టర్లు, 881 ఇళ్ళు 2,700 మంది జనాభా గల రాయవరం గ్రామంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృతంగా పర్యటించారు.
తొలుత ఆయన రాయవరం గ్రామంలో మాజీ శాసనసభ్యులు దివంగత నేత వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కోలపల్లి సుధారాణి, గాజుల ఉదయలక్ష్మి, గుత్తికొండ పద్మావతి, చిన్నం రుక్మాబాయి, గెళ్ళ నాగమణి, సాతా రేణుక, మున్నంగి ధనలక్ష్మి, శ్రావణం ఆదిలక్ష్మి, దారపురెడ్డి లీల, సంకుల లక్ష్మి, కోలపల్లి ఆంధ్ర కుమారి, అరవ జానకమ్మ, గడ్డం వనమలమ్మ, పోతాడి సాంబశివ, ఆళ్ల శేషారత్నం తదితరుల గృహాలను మంత్రి జోగి రమేష్ సందర్శించి అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ప్రజలు పొందిన లబ్ధి వివరాలతో కూడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. జగనన్న ప్రభుత్వం రావడం వలన మీకు ఎన్నిన్నో ప్రయోజనాలు చేకూరడం జరుగుతుందని అలానే పెడన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి జోగి రమేష్ చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన పలువురు రాయవరం గ్రామస్తులు వారి పిల్లలతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ప్రధానంగా మనబడి నాడు నేడు, జగనన్న విద్యాకానుక జగనన్న అమ్మబడి జగనన్న, జగనన్న గోరుముద్ద లాంటి బృహత్కరమైన కార్యక్రమాల ద్వారా విద్యార్థులుకు వారి ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకారాదు అనే సదుద్దేశంతో ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఎన్నో అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మంచి భవిష్యత్తు పొందాలని ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏది లేదని అందుకు తగ్గ మనస్తత్వం, వ్యక్తిత్వం ప్రతి విద్యార్థినీ విద్యార్థి అలవర్చుకోవాలని ఆయన తెలిపారు. విద్యార్థి దశ నుంచే చిన్నారులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అటువంటి విజయ సాధనకై కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతారని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రతి విద్యార్థి సున్నితమైన మనస్తత్వాన్ని విడనాడి దృఢమైన మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని నేటి ఓటమి రేపటి విజయానికి నాందిగా భావించి లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేయాలని, కష్టపడితే సాధించలేనిది ఏది లేదని మంత్రి జోగి రమేష్ విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు.
విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంస్కరణలు, గతంలో ఏ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.పేదరికం కారణం వల్ల ఏ ఒక్క పాప, బాబు ప్రాథమిక, ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి ఉన్నతమైన యోచన అని చెప్పారు. పెద్ద పెద్ద చదువుల వల్ల ఏ ఒక్క తల్లి,తండ్రి అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆయన కోరుకున్నారని, తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశారని, చిన్నారులకు చదువును ఆస్తిగా ఇవ్వాలని ఆనాడే ఆయన భావించారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ ఇచ్చి ఆ పిల్లలను, తల్లిదండ్రులను ఆదుకోవడమే కాకుండా భోజనం, వసతి ఖర్చుల కోసం పిల్లలు, తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే వసతి దీవెన పథకం అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు
ఈ కార్యక్రమంలో రాయవరం గ్రామ సర్పంచ్ నందం మల్లేశ్వరి రవికిరణ్, పిఎసిఎస్ అధ్యక్షులు కోళ్ల వీర వెంకట బాలకృష్ణ , వైఎస్ఆర్సిపి గూడూరు మండల ఉపాధ్యక్షులు కోళ్ల వీర వెంకట నాంచారయ్య, రాయవరం ఆర్బికే చైర్మన్ ఉప్పలపు రాఘవయ్య, గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన రావు, జడ్పిటిసి వేముల సురేష్ రంగబాబు, వైస్ ఎంపీపీలు పిచ్చుక గంగాధర్ రావు, నేతల కుటుంబరావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, గూడూరు రైతు భరోసా కేంద్రం చైర్మన్ పర్ణం మహాలక్ష్మి నాయుడు ( పెదబాబు ) మండల పార్టీ అధ్యక్షులు గోరిపర్తి రవి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోటేపల్లి రత్నాకర రావు, వైస్సార్ సీపీ సీనియర్ నాయకులు తలుపుల వెంకటకృష్ణారావు, పిచ్చుక గంగాధర రావు, గూడూరు తహసిల్దార్ బి.విజయ ప్రసాద్, ఎంపీడీవో సుబ్బారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News