విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెడిమేడ్ దుస్తులు కుట్టించేందుకు ఆసక్తి కలిగిన ఏజెన్సీల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం లిమిటెడ్ (ఆప్కో) దరఖాస్తులు ఆహ్వానిస్తుదని సంస్ధ ఎండి ఒక ప్రకటనలో తెలిపారు. సంస్ధ పేరు, చిరునామా, జిఎస్ టి, పాన్ నెంబర్, అనుభవం, అందుబాటులో ఉన్న యంత్రాలు, సిబ్బంది సంఖ్య, టర్నోవర్, టెలిఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వంటి పూర్తి వివరాలతో ఆప్కో కేంద్ర కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పిల్లల నుండి పెద్దల వరకు అన్నిరకాల రెడిమేడ్ వస్త్రాలను ఆప్కో సిద్దం చేయాలని నిర్ణయించిందని ఫిబ్రవరి 11వతేదీ లోపు విజయవాడ ఏలూరు రోడ్డు రామమందిరం సమీపంలోని కేంద్రకార్యాలయానికి తమ ఆసక్తిని వెల్లడిస్తూ వివరాలు అందచేయాలని, మరింత సమాచారం కోసం ఆఫీసు పనివేళలలో ఎప్పుడైన సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News