Breaking News

ఆశా మాలవ్య కు సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్వతారోహకురాలిగా,క్రీడాకారిణిగా ఉన్న ఆశా మాలవ్య సైకిల్ పై దేశాన్ని చుట్టిరావాలన్న ఆకాంక్షతో ఆమె ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న విషం విదితమే. సోమవారం వాసవ్య మహిళా మండలిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు ఆశా మాలవ్య ను సత్కరించారు. అనంతరం ఇన్సర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మహిళా సాధికారత కొరకు 15,500 విలువ చేసే కుట్టుమిషన్ ను ఎ.నాగజ్యోతి కి ఆశా మాలవ్య ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్ష్యులు శ్రీమతి జి.కిరణ్మయి మాట్లాడుతూ ఆశా మాలవ్య అనుకున్నది సాధించాలని మా క్లబ్ తరపున శుభాకాక్షలను తెలుపుతున్నామన్నారు. అనంతరం వాసవ్య మహిళా మండలి కార్యదర్శి శ్రీమతి జి. రశ్మి మాట్లాడుతూ మహిళా భద్రత, సాధికారత నినాదాన్ని సమాజంలో తీసుకువెళ్ళే లక్ష్యంతో దేశవ్యాప్తంగా తిరుగుతూ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *