Breaking News

జగనన్న, టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటం

-ఈ నెల 22న చలో విజయవాడ – మహాధర్నా
-రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద సిపిఐ ధర్నాలు జయప్రదం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న, టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు న్యాయం జరిగే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పోరాటం కొనసాగిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. జగనన్న కాలనీలలో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని, టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక వసతులు కల్పించి, తక్షణమే లబ్దిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్‌ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టరేట్ల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో లబ్దిదారులతో ధర్నాలు జయప్రదంగా జరిగాయి.
జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఈ రోజు అన్ని జిల్లాల్లో కలెక్టర్ల కార్యాలయాల వద్ద లబ్దిదారులతో కలిసి ధర్నాలు నిర్వహించారు. తిరుపతి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగిన మహాధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్లు ఇచ్చామని ప్రగల్బాలు పలుకుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వాటి నిర్మాణ దశను కళ్ళు తెరిచి పరిశీలించాలన్నారు. కేవలం ఒక సెంటు స్థలం ఒక కుటుంబ నివాసానికి ఎలా సరిపోతుందని ప్రశ్నించారు? ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షలు కనీసం పునాదులకు కూడా సరిపోదన్నారు. ఒక ట్రాక్టర్‌ ఇసుక రూ.8 వేలు, లారీ ఇసుక రూ.40 వేలకు అమ్ముతుంటే పేదలు ఇళ్లను ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు? ఇసుక, సిమెంట్‌, ఇటుక, స్టీల్‌ తదితర భవన నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. జగనన్న ఇళ్లను లబ్దిదారులే నిర్మించుకోవాలని, లేనిపక్షంలో ఆయా ఇళ్లను రద్దు చేస్తామంటూ బెదిరింపులకు దిగడం దుర్మార్గమన్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన పేదలు అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. జగనన్న ఇళ్ళ నిర్మాణానికి ఉచితంగా ఇసుక, సిమెంటు సరఫరా చేసి రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. వీటి సాధన కోసం ఫిబ్రవరి 22వ తేదీన చలో విజయవాడ, మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ నిర్వహించిన ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ రామకృష్ణ అభినందనలు తెలిపారు.
తిరుపతిలో జరిగిన ధర్నాలో కె.రామకృష్ణతోపాటు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరనాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.జయలక్ష్మీ, తిరుపతి జిల్లా కార్యదర్శి పి.మురళీ, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, నరసరావుపేటలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ. మారుతీవరప్రసాద్‌, విశాఖపట్నంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి, విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్‌బాబు, బాపట్లలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంఎల్‌సి జల్లి విల్సన్‌, బాపట్ల జిల్లా కార్యదర్శి టి.సింగరకొండ, రాయచోటిలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, అన్నమయ్య జిల్లా కార్యదర్శి పిఎల్‌ నర్సింహులు, అనంతపురంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీష్‌, జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌, కర్నూలులో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, గుంటూరులో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌, ఏలూరులో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య, భీమవరంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పార్వతీపురంలో రాష్ట్ర నాయకులు పి.కామేశ్వరరావు, మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావుÑ చిత్తూరులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు, జిల్లా కార్యదర్శి ఎస్‌ నాగరాజు, నంద్యాలలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె.రామాంజనేయులుÑ జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.రాజేంద్రబాబు, విజయవాడలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు పి.దుర్గాభవాని, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ కోటేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, అనకాపల్లిలో జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకట రమణ, జగ్గయ్యపేటలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు దోనేపూడి శంకర్‌, కడపలో జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, రాజమండ్రిలో తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి.మధు, ఒంగోలులో ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, శ్రీకాకుళంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎన్‌ లెనిన్‌బాబు, జిల్లా కార్యదర్శి బి శ్రీరామమూర్తి, పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్‌, నెల్లూరులో రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆవుల శేఖర్‌, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, మచిలీపట్నంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె.శివారెడ్డి, కృష్ణాజిల్లా ఇన్‌చార్జ్‌ కార్యదర్శి టి.తాతయ్య, విజయనగరంలో జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *