Breaking News

కార్యకర్తలే జనసేన పార్టీకి బలం

-మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును పశ్చిమ లో విజయవంతం చేద్దాం
-కీలక సమయాల్లో క్రియాశీలక సభ్యత్వం జనసైనికుల కుటుంబాలకు అండగా ఉంటుంది
-5000 నుండి 7500 క్రియాశీలక సభ్యత్వాలను పశ్చిమ నియోజకవర్గంలో అందించేలా ప్రతి ఒక్కరం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పని చేద్దాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్,విజయవాడ నగర అధ్యక్షులు & రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ, రాష్ట్ర కమిటీ, అమ్మవారి ధార్మిక సేవ మండలి, అధికార ప్రతినిధి, లీగల్ సెల్, ఐటి, కృష్ణా పెన్నా మహిళా కమిటీ, కృష్ణాజిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
గత ఏడాది 2000 పై చిలుకు క్రియాశీలకు సభ్యత్వాలను చేశామని ఈ ఏడాది 5వేల నుంచి 7500 మంది క్రియాశీలక సభ్యులను రాబోయే ఎన్నికల దృష్ట్యా చేర్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని, క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయలు తో తీసుకున్న వారికి పార్టీ కార్యక్రమాలు యొక్క వివరాలు నేరుగా పార్టీ నుంచి అందుతాయని, పార్టీ కిట్ మరియు ప్రమాదం బారిన పడి మరణిస్తే 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందుతుందని, ప్రమాదం జరిగితే ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం 50 వేల రూపాయల వరకు పరిహారం అందజేస్తారని ఇటువంటి క్రియాశీలక సభ్యత్వం రాష్ట్రంలో ఏ పార్టీ కూడా చేయడం లేదని కార్యకర్తల భద్రత భరోసా భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఎంతో దూరదృష్టి తో చేస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గం లో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం జనసేన పార్టీ మాత్రమేనని గత నాలుగు సంవత్సరాలుగా నిత్యం అధికార పార్టీ చేస్తున్న అవినీతి అరాచక అన్యాయాలను జనసేన పార్టీ మాత్రమే ఎదిరించి పోరాడి ప్రజల పక్షాన నిలిచామన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోతేనే మహేష్ పోటీ చేస్తారని భారీ మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *