Breaking News

హరే కృష్ణ గోకులక్షత్రం వారి ఫేస్1 శ్రీకృష్ణబలరామ దేవస్థానం ప్రారంభోత్సవం

విజయవాడ (తాడేపల్లి), నేటి పత్రిక ప్రజావార్త :
హరే కృష్ణ గోకులక్షత్రం వారి ఫేస్ 1 శ్రీకృష్ణ బలరామ శ్రీ శ్రీ నీతాయిగారంగా దేవస్థానం ప్రాంభోత్సవం తాడేపల్లి కొలనుకొండలో అద్భుతంగా జరిగింది. శ్రీ శ్రీ నీతాయిగారంగ(శ్రీ కృష్ణ బలరామ) లనుఆహ్వానించే ముందు శ్రీ మహా కళాశ స్థాపన, రాజగోపుర కళాశాల స్థాపన, యజ్ఞాలు, హోమాలు, తత్వన్యాస హోమాలు జరిగాయి. అనంతరం శ్రీ కృష్ణ బాలరాము లకు మహా కుంభభిషేకం జరిగింది. ద్వాదశ ఫల రసాలతో, 26 రకాల పుష్పలతో, 108 కళాశాలతో మరియు పంచామృత, పంచద్రవ్యలతో అభిషేకం పలు హరతులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో శ్రీ మధు పండిత దాస, చైర్మన్ అక్షయ పాత్ర ఫౌండేషన్ మరియు హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా, శ్రీ సత్య గౌర చంద్ర దాస ప్రెసిడెంట్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అండ్ ఆంధ్ర తెలంగాణ జీబీఆర్ బోర్డ్డ్ రిప్రెజెంటేటివ్, టెంపుల్ ప్రెసిడెంట్ హెచ్ కేఎం అహ్మదాబాద్ శ్రీ జగన్మోహన్ దాస, హరే కృష్ణ గోకుల క్షేత్రం టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ వంశీ ధర దాస పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హరే కృష్ణా గోకుల క్షేత్రం అధ్యక్షులు వంశీధర దాస మాట్లాడుతూ ఎంతో మంది భక్తులు నడుమ టెంపుల్ ప్రారంభోత్సవం కోలాహలంగా జరగడం హర్షణీయమన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *